May 8 2021 @ 15:14PM

ఆకట్టుకుంటున్న 'థాంక్యూ బ్రదర్‌'

'ఆహా'లో తాజాగా రిలీజైన 'థాంక్యూ బ్రదర్‌' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ర‌మేశ్ రాప‌ర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విరాజ్‌ అశ్విన్‌, అనసూయ భరద్వాజ్‌ నటించారు. హార్ట్ టచింగ్ కాన్సెప్ట్‌లో వీరిద్దరి పాత్రలు హైలెట్‌గా నిలిచాయి. చక్కని కథాంశంతో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడు నీరాజనాలు పలుకుతారు. ఆకోవలో 'థాంక్యూ బ్రదర్‌' చేరుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారట. గర్భవతి పాత్రలో అనసూయ జీవించినదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రంగస్థలం సినిమా తర్వాత మళ్ళీ అలాంటి ప్రశంసలు 'థాంక్యూ బ్రదర్‌'లో పోషించిన పాత్రకు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా 'ఆహా'లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. 

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...