‘సిద్దేశ్వరం’ తోనే నీటిని పొందే అవకాశం

ABN , First Publish Date - 2022-05-28T05:15:53+05:30 IST

రాయలసీమ ప్రాంతం నికరజలాలు లేక, మిగులుజలాలపై అధారపడి కరువుసీమగా మిగిలిపోతోందని, ఈ పరిస్థితుల్లో సిద్దేశ్వరం అలునిర్మాణం ద్వారానే, గతంలో రాయలసీమ కోల్పోయిన నీటిని తిరిగి పొందే అవకాశం ఉందని ప్రముఖ శస్త్రచికిత్స వైద్యనిపుణుడు డాక్టర్‌ నాగదస్తగిరిరెడ్డి అభిప్రాయపడ్డారు.

‘సిద్దేశ్వరం’ తోనే నీటిని పొందే అవకాశం
సిద్దేశ్వరం అలుగు జలదీక్ష పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు క్రైం, మే 27 : రాయలసీమ ప్రాంతం నికరజలాలు లేక, మిగులుజలాలపై అధారపడి కరువుసీమగా మిగిలిపోతోందని, ఈ పరిస్థితుల్లో సిద్దేశ్వరం అలునిర్మాణం ద్వారానే, గతంలో రాయలసీమ కోల్పోయిన నీటిని తిరిగి పొందే అవకాశం ఉందని ప్రముఖ శస్త్రచికిత్స వైద్యనిపుణుడు డాక్టర్‌ నాగదస్తగిరిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన నివాసంలో సిద్దేశ్వరం అలుగు నిర్మాణ జలదీక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 31న రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టే జలదీక్షలో రాయలసీమ జిల్లాల నుంచి ప్రజలు విరివిరిగా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్‌ రాంప్రసాద్‌రెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధి సదా ఓబుల్‌రెడ్డి ,ఎంఎ్‌సఎన్‌ఆర్‌ సేవాట్రస్ట్‌ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, శివోహం అన్నప్రసాద సేవా సంఘం ఉపాధ్యక్షుడు విష్ణునారాయణరెడ్డి, వనభోజన సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, స్పందన ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-28T05:15:53+05:30 IST