పంటల నిల్వకు అవకాశం

ABN , First Publish Date - 2022-01-22T04:49:49+05:30 IST

జిల్లాలో రైతుల పంటలు చెడిపోకుండా కలెక్షన్‌ సెంటర్లలో నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు.

పంటల నిల్వకు అవకాశం

  కలెక్షన్‌ సెంటర్ల ఏర్పాటుతో రైతుకు లాభాలెన్నో..

  డీఆర్‌డీఏ పీడీ అశోక్‌ కుమార్‌ వెల్లడి

 విజయనగరం (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతుల పంటలు చెడిపోకుండా కలెక్షన్‌ సెంటర్లలో నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ.. కోత తర్వాత వరి, అపరాలు, ఉద్యాన పంటలు చెడి పోకుండా ప్రోసస్‌ చేసి కలెక్షన్‌, మీని కలెక్షన్‌ సెంటర్లలో నిల్వచేస్తే తిరిగి అమ్మేందుకు వీలుంటుందన్నారు. దీనివల్ల రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని తెలిపారు. ఉద్యానవన శాఖ ద్వారా అందిస్తున్న రాయితీ పథకాలపై రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అవగాహన కల్పించాలని సూచించారు. రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల విలువ గల కలెక్షన్‌, సెంటర్లు, కోల్డ్‌రూమ్స్‌, ఫ్రీజర్‌ కలిగిన వ్యాన్‌లకు 75 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యానవన శాఖ అందిస్తున్న యూనిట్లను  రామభద్రపురం, మెరకముడిదాం, దత్తిరాజేరు, తెర్లాం మండ లాల్లో  ఏర్పాటు చేసేందుకు సెర్ఫ్‌ ఎస్‌వోపీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌  సుము ఖత వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ డీడీ శ్రీనివాసరావు, ఏడీ సత్యనారాయణరెడ్డి,  డీఆర్‌డీఏ, వైకేపీ సిబ్బంది , ఏసీలు, ఏపీఎంలు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-22T04:49:49+05:30 IST