ఇంటర్‌ హాల్‌టికెట్ల తప్పుల సవరణలకు అవకాశం

ABN , First Publish Date - 2021-04-13T06:11:13+05:30 IST

2020-21 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్‌ విద్యార్థుల హాల్‌ టికెట్లపై ఫొటోలు, సంతకాలు సరిచేసుకునే అవకాశాన్ని ఇంటర్‌బోర్డు మరోసారి కల్పించినట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా అధికారి రఘురాజ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్‌ హాల్‌టికెట్ల తప్పుల సవరణలకు అవకాశం

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 12: 2020-21 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్‌ విద్యార్థుల హాల్‌ టికెట్లపై ఫొటోలు, సంతకాలు సరిచేసుకునే అవకాశాన్ని ఇంటర్‌బోర్డు మరోసారి కల్పించినట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా అధికారి రఘురాజ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఏయిడెడ్‌, మోడల్‌, సాంఘిక సంక్షేమ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు వెంటనే విద్యార్థుల హాల్‌టికెట్లలో తప్పులను సరిదిద్దుకునేందుకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు విద్యార్థులహాల్‌ టికెట్లపై ఫొటో, సంతకం సవరణ చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 


Updated Date - 2021-04-13T06:11:13+05:30 IST