కన్సాలిడేషన్‌కు అవకాశం

ABN , First Publish Date - 2022-05-23T08:51:45+05:30 IST

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గా ప్రారంభమై మద్ద తు స్థాయిలైన 15800 ఎగువకు చేరుకుంది. ఆ తర్వాత ర్యాలీని కనబరుస్తూ 16400 స్థాయిలకు చేరింది.

కన్సాలిడేషన్‌కు అవకాశం

సోమవారం స్థాయిలు

నిరోధం : 16350, 16420

మద్దతు : 16190, 16150


నిఫ్టీ గత వారం పాజిటివ్‌గా ప్రారంభమై మద్ద తు స్థాయిలైన 15800 ఎగువకు చేరుకుంది. ఆ తర్వాత ర్యాలీని కనబరుస్తూ 16400 స్థాయిలకు చేరింది. అనంతరం బలమైన రియాక్షన్‌ను చవిచూసింది. చివరకు వారం గరిష్ఠ స్థాయిలో క్లోజయి బుల్లిష్‌ ట్రెండ్‌ను సూచించింది. ఆరు వారాల డౌన్‌ట్రెండ్‌ అనంతరం మార్కెట్‌ గతవారం టెక్నికల్‌ పుల్‌బ్యాక్‌ బౌన్స్‌ బ్యాక్‌ను కనబరిచింది. ప్రధాన మద్దతు స్థాయిలైన 15800 నుంచి రికవరీ సాధించటం ద్వారా సానుకూల సంకేతాలు వెలువరించింది.

నిఫ్టీ ఇంకా స్వల్పకాలిక నిరోధ స్థాయిలైన 16600 దిగువన ఉండటంతో ఎలాంటి స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ను సూచించటం లేదు. నిఫ్టీ గత  వారం ఎలాంటి కన్సాలిడేషన్‌ను సూచించకుండా కనిష్ఠ స్థాయిల నుంచి బౌన్స్‌ బ్యాక్‌ అయ్యింది. దీంతో ఈ వారం స్వల్పకాలిక దిశను తీసుకునే ముందు కన్సాలిడేషన్‌కు అవకాశాలున్నాయి. అంతేకాకుంగా స్వల్పకాలిక నిరోధ స్థాయిల వద్ద పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రధాన నిరోధ స్థాయిలైన 16600 వద్ద నిలదొక్కుకుంటేనే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఉంటుందా లేదా అనేది తేలుతుంది. 


బుల్లిష్‌ స్థాయిలు: సానుకూల ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధ స్థాయిలైన 16350 ఎగువన నిలదొక్కుకోవాల్సి ఉంటుం ది.  అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ తప్పనిసరిగా నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధం 16600.  

బేరిష్‌ స్థాయిలు: ఏదేనీ రియాక్షన్‌ను కనబరిస్తే 16150 దిగువన మైనర్‌ మద్దతు స్థాయిలుంటాయి. ఇది గత శుక్రవారం ఏర్పడిన స్థాయి. ఇక్కడ కూడా నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. తదుపరి మద్దతు స్థాయి 16000. ఇక్కడ కూడా నిలదొక్కుకోలేకపోతే 15800 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. గత వారం ఈ స్థాయిల వద్ద మార్కెట్‌ బలమైన రికవరీ సాధించింది. 

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గతవారం ప్రధాన మానసిక అవధి స్థాయిలైన 33000 నుంచి రికవరీ సాధించింది. చివరకు 1156 పాయింట్ల లాభంతో 34276 వద్ద క్లోజైంది. ఈ వారం అప్‌ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధ స్థాయిలైన 34650 ఎగువన నిలదొక్కుకోవాలి. తదుపరి నిరోధ స్థాయిలు 35000. 

పాటర్న్‌: నిఫ్టీ ప్రస్తుతం 16350 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద ఉంది. అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. 16350 వద్ద డబుల్‌టా్‌పను ఏర్పరచుకుంది. అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ బ్రేకౌట్‌ సాధించాల్సి ఉంటుంది. నిప్టీ స్వల్పకాలిక ఓవర్‌సోల్డ్‌ పొజిషన్‌ నుంచి రికవరీ సాధించింది. ప్రస్తుతం స్వల్పకాలిక చలన సగటు ఇండికేటర్‌ కంటే దిగువన ఉంది. ఇక్కడ పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. 

టైమ్‌: వీక్లీ చార్టుల ప్రకారం గురువారం స్వల్పకాలిక రివర్సల్‌ ఉంది.  

Updated Date - 2022-05-23T08:51:45+05:30 IST