ధరణిలో మార్పులకు అవకాశం

ABN , First Publish Date - 2021-04-10T05:53:49+05:30 IST

జిల్లాలో భూప్రక్షాళన తర్వాత ఏర్పడిన భూ సమస్యలను పరిష్కరించేందుకు యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ధరణిలో ఆప్షన్‌లు ఇవ్వడంతో ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. భూ సమస్యలు ఉన్నవారు మీసేవా ద్వారా దరఖాస్తు చేయగానే కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఆ విషయాలను పరిశీలిస్తున్నా

ధరణిలో మార్పులకు అవకాశం

పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు మోక్షం 

గత కొన్నిరోజులుగా మీసేవా ద్వారా సేవలు 

వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ 

భూ సమస్యలన్నింటికీ పరిష్కారం 

కొత్త పట్టాదార్‌ పాస్‌పుస్తకాల మంజూరు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో భూప్రక్షాళన తర్వాత ఏర్పడిన భూ సమస్యలను పరిష్కరించేందుకు యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ధరణిలో ఆప్షన్‌లు ఇవ్వడంతో ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. భూ సమస్యలు ఉన్నవారు మీసేవా ద్వారా దరఖాస్తు చేయగానే కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఆ విషయాలను పరిశీలిస్తున్నారు. వెంట నే ఆ భూముల సమస్యలను నిబంధనల మేరకు పరిష్కరిస్తున్నారు. వారికి కావాల్సిన పట్టాదారు పాస్‌ పుస్తకాల్లో మా ర్పులను చేస్తున్నారు. పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా వెంటనే పరిష్కారం చూయిస్తున్నారు. భూ సమస్యలు పరిష్కారం కాని వాటికి ఏవిధంగా ముందుకు పోవాలని అధికారులు దరఖాస్తు చేసుకున్నవారికి వివరిస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు వచ్చిన దరఖాస్తులను క్లీయర్‌ చేస్తున్నారు. భూప్రక్షాళన తర్వాత ధరణిలో మార్పులు, చేర్పులకు అవ కాశం ఇవ్వకపోవడంతో గడిచిన మూడేళ్లుగా చాలామంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిత్యం తహసీల్దార్‌ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. భూ ప్రక్షాళన సమయంలో భూముల వివరాల నమోదులో తప్పిదాలు జరగడం ఒకరిపేరుకు బదులు మకొకరి పేరు ఎంట్రీ చేయడం, భూ విస్తీర్ణంలో తేడాలు ఉండడం, వ్యవసాయ భూమి పట్టాదారుడైన ప్రభుత్వ భూమిగా నమోదు చేయ డం, చాలా గ్రామాల పరిధిలో రైతుల భూములను అటవీ లేదా అసైండ్‌ భూములుగా కొన్ని చోట్ల ఎంట్రీ చేయడం వల్ల సమస్యలను ఎదుర్కొన్నారు. 

అధికారులకు వినతుల వెల్లువ

తమకు వచ్చిన ఇబ్బందులను పరిష్కరించాలని తహసీల్దార్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ను కలుస్తూ వినతిపత్రాలను ఇచ్చారు. భూప్రక్షాళన సమయంలో భూముల వివరాలను స్థానిక వీఆర్‌వోలు, ఇతర రెవెన్యూ అధికారులు సక్రమంగా నమోదు చేయకపోవడం వల్ల పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు జారీ కాకపోవడం, పాస్‌ పుస్తకాలు వచ్చిన ఇతర తప్పిదాలు ఉండడం వల్ల వాటిని సరిచేయాలని కోరారు. రెండు నెలల క్రితం ధరణిలో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వీటిని కలెక్టర్‌ ఆధ్వర్యంలో చేపట్టి ఎక్కడిక్కడ పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు కొత్తవారు కూడా మీసేవా ద్వారా దరఖాస్తు చేయగానే వాటిని కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రతీరోజు పరిశీలిస్తున్నారు. రెవెన్యూ అధికారులతో కలిసి ఆయా మండలాల పరిధిలో నుంచి పూర్తి వివరాలు తెప్పించుకుం టూ రోజుకు వంద నుంచి 150 వరకు భూ సంబంధిత దరఖాస్తులను పూర్తిచేస్తున్నారు. చిన్నచిన్న సమస్యలున్న వాటన్నింటిని పరిష్కరించడంతో పాటు కొత్తగా పట్టదార్‌ పాస్‌పుస్తకాలను జారీ చేస్తున్నారు. పాస్‌ పుస్తకాల్లో పేరుతో పాటు ఇతర ఎంట్రీల్లో తప్పు ఉంటే వాటిని సరిచేస్తున్నారు. ఏవైనా కోర్టు పరిధిలో భూ సంబంధిత కేసులుంటే.. అవి అక్కడ పరిష్కారమైన తర్వాతే దృష్టి పెడుతున్నారు. అటవీ, అసైండ్‌ భూముల్లో సాగు చేస్తున్న వాటి వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో జాయింట్‌ సర్వే నిర్వహిస్తూ వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలో 2004  ముందు అటవీ భూముల్లో సాగులో ఉన్న వారికి పట్టాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉండడం వల్ల భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు మీసేవాలో దరఖాస్తు చేసుకుని వివరాలు పంపిస్తే సరిపోతుందని అధికారులు కోరుతున్నారు. ఆ దరఖాస్తులు తీసుకుని కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరంలేదన్నారు. ఆన్‌ లైన్‌లో వివరాలు రాగానే.. ఏ రోజుకు ఆరోజు పరిష్కరిస్తున్నామని రెవెన్యూ అధికారులు వివరిస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గే వరకు జాగ్రత్తలు పాటిస్తూ మీసేవా ద్వారా దరఖాస్తు చేయాలని వారు కోరుతున్నారు. ధరణి సమస్యలపై దరఖాస్తులు చేసుకుంటే.. వెంటనే పరిష్కరిస్తామని స్పష్టం చేస్తున్నాస్తున్నారు. ధరణిలో మార్పులు, చేర్పులకు అవకాశం ఇవ్వడం వల్ల గడిచిన కొన్ని రోజులుగా చాలా దరఖాస్తులను  కలెక్టర్‌ పరిష్కరించారు. మరికొన్ని రోజుల్లో మీసేవా ద్వారా వచ్చే వాటన్నింటిని క్లీయర్‌ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ధరణిలో కొన్ని మార్పులు, చేర్పులకు అవ కాశం ఇవ్వడం వల్ల చిన్నచిన్న సమస్యలు పరిష్కారం అయి నట్లు అధికారులు తెలిపారు. ధీర్ఘకాలికంగా భూ సమస్యల న్నీ ప్రస్తుతం పరిష్కారం అవుతున్నాయి. 

Updated Date - 2021-04-10T05:53:49+05:30 IST