రెండు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న కోవిడ్ పాజిటివిటీ రేటు

ABN , First Publish Date - 2021-10-02T23:06:26+05:30 IST

దేశంలో రికార్డు స్థాయిలో 90 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్టు ఓవైపు కేంద్రం ప్రకటించిన తరుణంలోనే..

రెండు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న కోవిడ్ పాజిటివిటీ రేటు

న్యూఢిల్లీ: దేశంలో రికార్డు స్థాయిలో 90 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్టు ఓవైపు కేంద్రం ప్రకటించిన తరుణంలోనే కేరళ, మిజోరాం రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతూ ఒకింత ఉపశమనం కలిగిస్తుండగా, ఈ రెండు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కోవిడ్ కేసుల అదుపునకు కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్ చర్యలు తప్పనిసరి పరిస్థితి కనిపిస్తోంది.


దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కేరళలో 13,834 కొత్త కేసులు నమోదు కాగా, 95 మరణాలు సంభవించాయి. పాజిటివిటీ రేటు సుమారు 16 శాతంగా ఉంది. మరోవైపు, మిజోరాంలో పాజిటివిటీ రేటు కేరళ కంటే కాస్త ఎక్కువగా 17 శాతం ఉంది. ఆ తర్వాత మూడు రాష్ట్రాల్లో సిక్కిం (9శాతం), మేఘాలయ (5శాతం), మణిపూర్ (5శాతం) నిలుస్తున్నాయి. పండుగ రోజులు సమీపిస్తుండంతో ఈ ఐదు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ లేదా వ్యూహాత్మక/నిరోధక చర్యలు తీసుకోవాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-10-02T23:06:26+05:30 IST