పాజిటివ్‌@104

ABN , First Publish Date - 2020-05-29T11:23:59+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికారికంగా సెంచరీ దాటి 104కు చేరుకున్నాయి. సుమారు ఇరవై మంది ..

పాజిటివ్‌@104

జిల్లాలో విస్తరిస్తున్న వైరస్‌

34 వేల మందికి పరీక్షలు

మళ్లీ మొదలైన ఫీవర్‌ సర్వే


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి):జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికారికంగా సెంచరీ దాటి 104కు చేరుకున్నాయి. సుమారు ఇరవై మంది అను మానితులకు పరీక్షలు నిర్వహించి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త మండలాలకు వైరస్‌ విస్తరిస్తోంది. ఇంత కుముందు ఎలాంటి అనుమానంలేని చోట్ల లక్షణాలు బయట పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుండగా దీనికి సమాంతరంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా ఐదు మండలాల్లో వైరస్‌ అనుమానిత లక్షణాలు కొంత మందిలో బయటపడ్డాయి. వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించగా నివేదికలు అందాల్సి ఉంది.


రెండు నెలలుగా లాక్‌డౌన్‌ అమలులో వైరస్‌ కట్టడిలో ఉన్నట్లు కనిపించినా ఇప్పుడు కేసుల సంఖ్య పెరగ డం ఆశ్చర్యకరం. జిల్లాలో నమోదైన 104 పాజిటివ్‌ కేసులలో అత్యధికులు నడివయస్కులే. వారిలో మూడో వంతు వయో వృద్ధులు, ఇంకొందరు మహిళలు. అత్యధికులు 45 ఏళ్లలోపు వారు కావడంతోపాటు కొంతమందికి ప్రైమరీ, సెకండరీ కాం టాక్ట్స్‌, ఇంకొందరికి సాధారణ కేటగిరిలో పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇటీవల వీరవాసరం, కాళ్ల, ద్వారకాతిరుమల, తాళ్ల పూడి మండలాల్లో కొందరికి అనుమానిత లక్షణాలు కనిపిం చాయి. వారందరికీ పరీక్షల నిర్వహణ పూర్తికాగా కొందరిని ఆసుపత్రికి తరలించారు. 


మరోసారి ఫీవర్‌ సర్వే

జిల్లావ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందో ళన కలిగిస్తుండగా, కొత్త ప్రాంతాలకు విస్తరించడం, కేసుల విషయంలో ముందస్తు స్పష్టత లేకపోవడాన్ని ప్రభుత్వం పరి గణనలోకి తీసుకుంది. గడపగడపకు వెళ్లి ఫీవర్‌ సర్వే నిర్వ హించాలని ఆదేశించింది. రెండు, మూడు రోజులలోనే వేల సంఖ్యలో సర్వే పూర్తైనట్లు లెక్కలు తేల్చడంతో సర్వేను తక్ష ణం రద్దు చేసి తిరిగి మరల కొనసాగించాలని కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో మరోమారు స్పష్టమైన సర్వే నిర్వహణకు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 34 వేల మందికి కరోనా పరీక్షలు చేశారు. వారిలో 30 వేల మందికి నెగెటివ్‌ వచ్చింది. మరో మూడు వేల మందికి నిర్ధారణ కావాల్సి ఉంది. ఇప్పటికే 57 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయగా, 47 మంది ఐసోలేషన్‌ వార్డులో కొనసాగుతున్నారు.


ఏలూరులో రెడ్‌ జోన్‌

ఏలూరు రూరల్‌ : శివగోపాలపురంలోని మహిళకు, పెన్షన్‌ లైల్‌లో ఒకరికి కరోనా కేసు నమోదు కావడంతో ఆ ప్రాంతాల ను రెడ్‌జోన్‌ చేశారు. అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు.  అనుమానితులను క్వారెంటైన్‌ కేంద్రాల కు తరలిస్తున్నారు. రెడ్‌జోన్‌లో నిత్యావసరాలు ఇంటి వద్దనే అందించే ఏర్పాట్లుచేశారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాం తాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మునిసిపల్‌ అధికారు లు పారిశుధ్యం మెరుగుపరిచే కార్యక్రమాలు చేపట్టి, ఇంటిం టికీ హైడ్రోక్లోరినేషన్‌ పిచికారీ చేశారు.

Updated Date - 2020-05-29T11:23:59+05:30 IST