ఒక్క వ్యక్తికి పాజిటివ్.. ఏకంగా 69 మందికి క్వారంటైన్

ABN , First Publish Date - 2020-04-03T20:11:40+05:30 IST

కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు జనగామ జిల్లాలో నమోదైంది. ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌ సమ్మేళనానికి జనగామ జిల్లా నుంచి హాజరై తిరిగి వచ్చిన ముగ్గురిలో ఒకరికి

ఒక్క వ్యక్తికి పాజిటివ్.. ఏకంగా 69 మందికి క్వారంటైన్

వెల్దండ వాసికి పాజిటివ్‌.. 69 మంది క్వారంటైన్‌కు తరలింపు

జనగామ, వరంగల్ (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు జనగామ జిల్లాలో నమోదైంది. ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌ సమ్మేళనానికి జనగామ జిల్లా నుంచి హాజరై తిరిగి వచ్చిన ముగ్గురిలో ఒకరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ జరిగినట్లు కలెక్టర్‌ కె.నిఖిల గురువారం సాయంత్రం ప్రకటించారు. జిల్లా కేంద్రం నుంచి ఇద్దరు, నర్మెట మండలం వెల్దండ గ్రామం నుంచి ఒకరు మర్కజ్‌ సమ్మేళనానికి వెళ్లిరాగా, వెల్దండకు చెందిన వ్యక్తికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈ మేరకు సదరు వ్యక్తితో దగ్గరగా మెదిలిన 69మందిని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రానికి తరలించినట్లు కలెక్టర్‌ తెలిపారు. అలాగే వెల్దండ గ్రామంలో మొత్తం సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావకాన్ని పిచికారి చేయించి గ్రామ పరిసరాలను పరిశుభ్రం చేయించే పని లో అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే జిల్లా వ్యాప్తంగా భద్రత ఏర్పాట్లు చేస్తూ ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీచేశారు.

Updated Date - 2020-04-03T20:11:40+05:30 IST