ఒకే పంచాయతీలో 22 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-09T10:38:22+05:30 IST

మండలంలోని ఒకే పంచాయతీల్లో 22 మందికి శనివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు గ్రామ రెవెన్యూ అఽధికారి రమణమూర్తి తెలిపారు.

ఒకే పంచాయతీలో 22 మందికి పాజిటివ్‌

పోలాకి, ఆగస్టు 8: మండలంలోని ఒకే పంచాయతీల్లో 22 మందికి శనివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు గ్రామ రెవెన్యూ అఽధికారి రమణమూర్తి తెలిపారు. వీరందరినీ ఉన్నత వైద్యం కోసం శ్రీకాకుళం తరలిస్తామని పేర్కొనగా బాధితులు అంగీకరించడం లేదని, అందువల్ల హోమ్‌క్వారెంటైన్‌లో ఉంచామన్నారు. పంచాయతీ కేంద్రంలో 17,  మరో గ్రామంలో 5 కేసులు బయటపడ్డాయన్నారు. కరోనా వైరస్‌ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్‌ ఎ.సింహాచలం, ఎంపీడీవో రాధాకృష్ణ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బయట తిరిగితే చర్యలు తీసుకుంటామన్నారు.


 రణస్థలంలో 13..

రణస్థలం: మండలంలో శనివారం 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమో దైనట్లు ఆర్‌ఐ శర్మ తెలిపారు. వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్నవారికి పరీ క్షలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు.ఫ పొందూరు: మండలంలో శనివారం 10   కరోనా కేసులు నమో దైనట్లు తహసీల్దార్‌ కె.మధుసూదనరావు, డీటీ నారాయణమూర్తి తెలిపారు. పొందూరులో లాక్‌డౌన్‌ పకడ్బందీగా  అమలుచేస్తున్నారు. బాధిత గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నామని చెప్పారు. ఫ సారవకోట:  మండలంలో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు మండల ప్రత్యేకాధికారి వి.జయరాజు తెలిపారు. రెండు గ్రామాల్లో కరోనా సోకగా ఈ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.  గ్రామాలను పరిశీలించి  జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు.. 


కొవిడ్‌-19లో భా గంగా ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలసు సక్రమంగా నిర్వహించాలని సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు. శనివానం కంట్రోల్‌ రూంలను సందరించి ఉద్యోగులకు, ఏఎన్‌ఎంలకు, ఆశా వర్కర్లకు, గ్రామ వలంటీర్లకు పలు సూచనలు చేశారు.ఫ హిరమండలం: మండలంలో శనివారం 4 పాజి టివ్‌ కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ సత్యనారాయణ తెలిపారు. మండల కేంద్రంతో పాటు వేర్వేరు గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు బయటపడ్డాయన్నారు.ఫ జలుమూరు: మండలంలో రెండు గ్రామాల్లో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మండల కొవిడ్‌ ప్రత్యేకాధికారి కె.రాజగోపాలరావు తెలిపారు.వేర్వేరు గ్రామాల్లో ఒక్కో కేసు నమోదైందన్నారు. ఈ గ్రామాల్లో కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు.  ఫ పాతపట్నం: మండలంలో ఇద్దరిలో కరోనా పాజిటివ్‌ లక్షణాలు శని వారం గుర్తించినట్లు తహసీల్దార్‌ ఎం.కాళీ ప్రసాద్‌ తెలిపారు. మేజర్‌ పంచా యతీతో పాటు మరో గ్రామంలో ఒక్కో కేసు నమోదూందన్నారు.  గ్రామాల్లో జ్వర పీడితులపై ప్రత్యేకదృష్టి సారించగా 56 మందికి వారికి వైద్యసేవలం దించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఈవో తంప హరికృష్ణ, వీఆర్వోలు బాలరాజు, పార్థసారధి, రోజా రమణి తదితరులు పాల్గొన్నారు.ఫ ఇచ్ఛాఫురం: ఇచ్ఛాపురంలో శనివారం ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు ఇన్‌చార్జి తహసీల్దార్‌ శ్రీహరి తెలిపారు.


ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఫ సీతంపేట: మండలంలో శనివారం 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమో దైనట్టు మండల ప్రత్యేకాధికారి బి.శ్రీనివాసరావు, తహసీల్దార్‌ జె.చల మయ్య, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు తెలిపారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 117 కేసులు నమోదయ్యాయని వివరించారు. ఫ రేగిడి: మండలంలో మూడు గ్రామాల్లో శనివారం ఏడు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు  వైద్యాధికారి ఆశ, ఆర్‌ఐ శ్రీనువాసరావు తెలిపారు. ఈ గ్రామాల్లో తదుపరి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శనివారం మూడు గ్రామాల్లో 80 కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.


నిబంధనలు పాటించాల్సిందే..

కోటబొమ్మాళి: మండలంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణం లో ప్రతి ఒక్కరు కరోనా నివారణ చర్యలు పాటించాలని తహసీల్దార్‌ డి.సోని కిరణ్‌ అన్నారు. శనివారం యలమంచిలి, కోటబొమ్మాళి గ్రామాల్లోని సచివా లయ సిబ్బంది, గ్రామవలంటీర్లతో సమీక్ష నిర్వహించారు.  


 అందుబాటులో ఉండాలి 

నరసన్నపేట: కలెక్టర్‌ ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని మండల ప్రత్యేకాధికారి ఆర్‌వీ రామన్‌ సూచించారు. శనివారం పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లను, కంటైన్మెంట్‌ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.ప్రవల్లిక ప్రియ, ఈవోపీఆర్డీ జి.రవికుమార్‌, ఎస్‌ఐలు సత్యనారాయణ, శంకరరావు తదితరులు పాల్గొన్నారు. 


 కరోనా కట్టడికి కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

రాజాం: మండలంలో కరోనా కేసులు నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు మండల ప్రత్యేకాధికారి ముదిలి జగ న్నాఽథం తెలిపారు. శనివారం పొగిరిలో ప్రత్యేక సమా వేశం నిర్వహించారు. కం ట్రోల్‌ రూంల వల్ల వ్యాధిగ్రస్థుల గుర్తింపు, ప్రత్యేక వైద్య సేవలకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.  పారిశుధ్య పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని, కొవిడ్‌ నిబంధనలు పాటించేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ విషయంలో  వైద్య సిబ్బంది జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించా రు. శ్యాంపురంలో జ్వరాల సర్వేపై ఎంపీడీవో శంకరరావు సిబ్బందితో సమా వేశం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారి భార్గవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-09T10:38:22+05:30 IST