2000 దాటేశాయ్‌!

ABN , First Publish Date - 2020-07-05T10:28:16+05:30 IST

కరోనా మహ మ్మారి జిల్లాలో స్వైరవిహారం చేస్తోంది. రోజూ వంద మందికిపైగానే కరోనా బారిన పడుతున్నారు. శనివారం కూడా జిల్లాలో

2000 దాటేశాయ్‌!

జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు..

ఒక్కరోజే 127 మందికి పాజిటివ్‌..

2099కి చేరిన బాధితుల సంఖ్య


అనంతపురం వైద్యం, జూలై 4: కరోనా మహ మ్మారి జిల్లాలో స్వైరవిహారం చేస్తోంది. రోజూ వంద మందికిపైగానే కరోనా బారిన పడుతున్నారు. శనివారం కూడా జిల్లాలో 127 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 2099 మందికి వైరస్‌ సోకింది. వీరిలో 1139 మంది కోలుకోగా.. 9 మంది మృతిచెందారు. మిగిలిన వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా విజృంభిస్తుండటంతో అధికార యంత్రాంగం, ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వటంతో జనం రోడ్లపైకి విచ్చలవిడిగా రావడంతో కరోనా వేగంగా వ్యాపిస్తోంది.


దీంతో కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మళ్లీ అధికారులు కేసులు నమోదవుతున్న ప్రాం తాల్లో ఆంక్షలు పెట్టి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే నష్టం జరిగిపోయింది. కొవిడ్‌ ఆస్పత్రుల్లో కూడా వసతులు లేక బాధితులను తరలించడానికి యంత్రాంగం సుముఖత చూ పట్లేదు. హోమ్‌ ఐసోలేషన్‌ పేరుతో ఇంటి వద్దనే ఉంచే ప్ర యత్నాలు చేస్తున్నారు. దీంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.  


పామిడిలో ముగ్గురికి..

మండలంలోని రామరాజుపల్లిలో 2, ఎద్దులపల్లిలో ఒక కరోనా కేసు నమోదైనట్లు ఎద్దులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌  రోహినాథ్‌ తెలిపారు. ఈ మూ డు కేసులతో మండలంలో 31 కేసులు నమోదయినట్లైంది.  


ఉరవకొండలో 12  మందికి 

పట్టణంలో 12 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అంుునట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఓ బ్యాం కు ఉద్యోగి కూడా ఉన్నారు. గాంధీ చౌక్‌, అంబే డ్కర్‌ నగర్‌, శాంతినగర్‌, మార్కెట్‌ ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 

 

మడకశిరలో మహిళకు ..

పట్టణంలోని ఎస్సీకాలనీలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారుల సమాచా రం. బాధితురాలిని బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.


తాడిపత్రిలో 11 మందికి...

పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 11 కరోనా కేసులు నమోదయ్యాయి. టైలర్స్‌ కాలనీలో 3, కృష్ణాపురం 4వరోడ్డులో 4, కృష్ణాపురం 6వరో డ్డులో 1, ఆశా ఆసుపత్రి 1, ఆసుపత్రిపాలెం 1, ఆంధ్రాబ్యాంక్‌ వెనుక భాగంలో 1 చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు న మోదయ్యాయి. ప్రభుత్వ మద్యం షాపులో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకింది.


రూరల్‌లో 3, తిమ్మంపల్లిలో 1..

తాడిపత్రి మండలంలోని గన్నెవారిపల్లి కాలనీలో మూడు, యల్లనూరు మండలంలోని తిమ్మం పల్లిలో 1 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. 


ఎర్రపల్లిలో రైతుకు..

మండలంలోని ఎర్రపల్లిలో ఓ రైతుకు కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. రైతు తాను పండించిన దోస కాయలను బెంగళూరుకు తీసుకెళ్లి, రావడంతో కరోనా సోకినట్లు అధికారులు పేర్కొన్నారు.  


ధర్మవరంలో ఆరు...

పట్టణంలో మరో ఆరు కరోనా  పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యులు తెలిపారు.  సత్య సాయినగర్‌ 1, ఎస్‌బీఐకాలనీ 1,  సుందర య్యనగర్‌ 1, శివానగర్‌ 2, శ్రీలక్ష్మీచెన్నకేశవపురంలో 1 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు.  


ముగ్గురు కార్మికులకు ...

కియ, దాని అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కార్మికు లకు కరోనా సోకింది. వీరిలో ఒకరు ఆల్విన్‌కాలనీ, మరొ కరు జీఐసీ కాలనీలో ఉండగా మరొకరు క్వారంటైన్‌లో ఉన్నారు.  


రంగాపురంలో యువకుడికి..

మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన 33 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి శనివారం తెలిపారు.

Updated Date - 2020-07-05T10:28:16+05:30 IST