కేసుల కలవరం

ABN , First Publish Date - 2021-06-14T05:00:32+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ దూకుడు తగ్గినప్పటికీ రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చుకుంటే కేసుల సంఖ్య అధికంగానే ఉంటోంది. ఈనెలలో ఒకట్రెండ్రోజులు మినహా మిగతా అన్ని రోజులు నిత్యం 500కు పైగానే పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఆదివారం కూడా 530 వెలుగు చూశాయి. గరిష్ఠ కేసుల నమోదులో రాష్ట్రంలోనే జిల్లా నాల్గోస్థానంలో ఉంది. మరోవైపు ఈనెలలో ఇప్పటికే 64 మరణాలు సంభవించడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అయినప్పటికీ కరోనా కట్టడి కోసం చేపట్టిన కర్ఫ్యూ అమలు విషయంలో జిల్లా యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

కేసుల కలవరం
పామూరులో కొవిడ్‌ పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

కరోనా పాజిటివ్‌లలో

రాష్ట్రంలో జిల్లా 4వ స్థానం 

నిత్యం 500పైనే నమోదు

ఈనెలలో ఇప్పటికే 

6937 మందికి వైరస్‌ 

64 మంది మృత్యువాత

అయినా కర్ఫ్యూ అమలులో ఉదాసీనత

ఒంగోలు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొవిడ్‌ దూకుడు తగ్గినప్పటికీ రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చుకుంటే కేసుల సంఖ్య అధికంగానే ఉంటోంది. ఈనెలలో ఒకట్రెండ్రోజులు మినహా మిగతా అన్ని రోజులు నిత్యం 500కు పైగానే పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఆదివారం కూడా 530 వెలుగు చూశాయి. గరిష్ఠ కేసుల నమోదులో రాష్ట్రంలోనే జిల్లా నాల్గోస్థానంలో ఉంది.  మరోవైపు ఈనెలలో ఇప్పటికే 64 మరణాలు సంభవించడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అయినప్పటికీ కరోనా కట్టడి కోసం చేపట్టిన కర్ఫ్యూ అమలు విషయంలో జిల్లా యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

గతంలో రాష్ట్రంలో 9వ స్థానం

జిల్లాలో రెండో వేవ్‌లో కొవిడ్‌ తీవ్రస్థాయిలో విజృంభించింది. ఏప్రిల్‌ 1నుంచి ఇప్పటి వరకు 52,406 కేసులు నమోదయ్యాయి. 284 మరణాలు సంభవించాయి. గత పక్షం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జిల్లాలోనూ గతనెలలో ఉన్న తీవ్రత ప్రస్తుతం లేకపోయినప్పటికీ ఇతర జిల్లాలతో పోల్చుకుంటే మాత్రం కేసుల సంఖ్య అధికంగానే ఉంటోంది. గత నెలలో ఎక్కువ రోజులు వెయ్యి నుంచి 1500లకుపైగా నమోదయ్యాయి. అప్పట్లో రాష్ట్రంలో జిల్లా 9వ స్థానంలో ఉంది. అయితే ఈనెలలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా ఇక్కడ మాత్రం నిత్యం 500లకు పైగానే పాజిటివ్‌లు నిర్ధారణ అవుతున్నాయి. 

ఆందోళన కలిగిస్తున్న కేసుల సంఖ్య

ఈనెల 1నుంచి  ఇప్పటి వరకూ 12 రోజుల పాటు రోజువారీ నమోదైన కేసుల సంఖ్య చూస్తే 6వతేదీన 447, 7వతేదీన 499 ఉండగా మిగిలిన అన్ని రోజులు నిత్యం 500పైనే వెలుగు చూశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయానికి  24 గంటల వ్యవధిలో 6670 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. 58 మంది మరణించారు. అందులో మన జిల్లాలో 530 కేసులు ఉండగా, ముగ్గురు మృతి చెందారు. అలా ఆదివారం 13 జిల్లాల్లో నమోదైన కేసులను ప్రాతిపదికగా తీసుకొని చూస్తే మన జిల్లా ఏకంగా 4వ స్థానంలో ఉంది. గతంలో భారీగా కేసులు నమోదైన విశాఖ, కృష్ణా, గుంటూరు,. కర్నూలు, నెల్లూరు, అనంతపురం తదితర అన్ని జిల్లాల కన్నా ఆదివారం మన జిల్లాలోనే కేసులు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 

రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్న ప్రజలు 

వైర్‌స వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన కర్ఫ్యూ అమలులో యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కేసులు తగ్గాయన్న భ్రమలో ఉన్న ప్రజానీకం యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం కర్య్పూ అమలు తీరు చూస్తే ఆంక్షల సడలింపు వేళ, అలాగే కర్య్పూ సమయంలో కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశారు. ప్రతి ఆదివారం మాంసం దుకాణాలను  మూసివేయిస్తున్న అధికారులు ఈవారం అనుమతించారు. ఇకఅవసరం ఉన్నా లేకపోయినా రోడ్డెక్కుతున్న జనాన్ని నియంత్రించే వారు కరువయ్యారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లాను మరోసారి కరోనా చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు. 


Updated Date - 2021-06-14T05:00:32+05:30 IST