పాజిటివ్‌ 112

ABN , First Publish Date - 2020-07-13T12:09:42+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగంతో అన్ని ప్రాంతాల్లోనూ దూసుకుపోతోంది.తాజాగాఆదివారం జిల్లాలో 112 పాజిటివ్‌ కేసులు ..

పాజిటివ్‌ 112

మళ్లీ వంద దాటిన కేసులు

కొత్తగా 30 కంటైన్మెంట్‌ జోన్లు

2,592కి చేరిన సంఖ్య


ఏలూరు ఎడ్యుకేషన్‌, జూలై 12 : జిల్లాలో కరోనా వైరస్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగంతో అన్ని ప్రాంతాల్లోనూ దూసుకుపోతోంది.తాజాగాఆదివారం జిల్లాలో 112 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా ఇందులో 56 కేసులు జిల్లా కేంద్రం ఏలూరులోనే ఉండడం గమనార్హం. మొత్తంగా జిల్లాలో ఇంత వరకు 2,592 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏలూరు  అశోక్‌నగర్‌, వెంకటాపురం, అమీనాపేట,తాపీమేస్ర్తి కాలనీ, తూర్పువీధి, గన్‌బజార్‌, కొత్తపేట, ఫిలాస్‌పేట, మేదర వీధి, చేపల తూము సెంటర్‌, భీమవరపు వారి వీధి, సింగ్‌ వీధి, పవర్‌పేట, వైఎస్‌ఆర్‌ కాలనీ, సబ్బుల వారి వీధి,బొమ్మివారి వీధుల్లో 56 కేసులు నమోదయ్యాయి.


అత్తిలి మండలం బల్లిపాడు పెదవీధిలో 14 కేసులు, తాడేపల్లిగూడెం 12, 23, 6, 1, 3 వార్డులతో పాటు కాగి తాల వారి వీఽధుల్లో 11 కేసులు, కొవ్వూరు, భీమడోలు,నరసాపురం, కైకలూరుల్లో మూడేసి చొప్పున, ఉండి మండలం ఎన్‌ఆర్‌సీ అగ్రహారం, విస్సాకోడేరు, భీమవరం,వీరవాసరం, మొగల్తూరులలో రెండేసి చొప్పున, గణపవరం, కొవ్వలి, విజయవాడ, పాలకొల్లు,దుంపగడప, గొరగనమూడి, పోడూరు, అత్తిలి మండలం పాలి, పడమరపాలెం ఒక్కో కేసు నమోదయ్యాయి.


30 కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు.. 

 కరోనా వ్యాప్తిని నివారించేందుకు 30 కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్‌ ముత్యాలరాజు  తెలిపారు.తాడేపల్లిగూడెం అర్బన్‌ వార్డులు 2,3, దెందులూరు మండలం పోతునూరు లక్ష్మీపురం కాలనీ, చిం తలపూడి మండలం రాఘవాపురం కుమ్మరవీధి, పెదవేగి మండలం వేగివాడ, ఏలూరు అర్బన్‌ వార్డు నెంబరు 1 ఎంఆర్‌సీ కాలనీ, 36వ వార్డు గుడివాడ వారి వీధి, సంతోషినగర్‌ శ్రీ శర్వాణి స్కూల్‌ వెనుక, 21వ వార్డు వంగాయగూడెం,ఆర్‌ఆర్‌పేట ప్రభావతి హాస్పటల్‌ రోడ్డు, అమీనాపేట జపనీస్‌ టైలర్స్‌ వద్ద,ఏలూరు రూరల్‌ మండలం మల్కాపురం, భీమడోలు మండలం గణపతి సెంటర్‌,దెందులూరు మండలం శ్రీరామవరం ఎంపీపీ స్కూలు వద్ద,మొగల్తూరు మండలం జెట్టి పాలెం రామన్నపాలెం, ఉంగుటూరు మండలం చేబ్రోలు ఇం దిరాగాంధీ కాలనీ, నిడదవోలు మండలం తాడిమళ్ల, ఉండి మండలం యండగండి తూర్పు వీధి, తాళ్లపూడి మండలం కుకునూరు, ఇరగవరం మండలం రేలంగి, చాగల్లు మండలం చిక్కాల, పెరవలి మండలం ఖండవల్లి కోలా వారి వీధి, తాడేపల్లిగూడెం  మండలం తాళ్లముదునూరుపాడు, 5 వార్డు రామాలయం వద్ద,9 వార్డు ఎలిమెంట్రీ స్కూలు వెనుక, నాగన్నవారి వీధి, 13వ వార్డు శివాలయం వీధి,27వ వార్డు ఎస్‌బీఐ సమీపంలోని కోకా హైట్‌,19వ వార్డు మిఠాయి సూరిబాబు వీధి, జంగారెడ్డి గూడెం 18వ వార్డు ఇండియన్‌ డిజిటల్‌ స్కూల్‌ వద్ద కొత్తగా కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ వివరించారు. 


Updated Date - 2020-07-13T12:09:42+05:30 IST