‘కోక్‌’ కొంప ముంచాడు

ABN , First Publish Date - 2021-06-17T09:20:22+05:30 IST

ఒక్క మాట.. సాకర్‌ స్టార్‌, పోర్చుగల్‌ జట్టు కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట ప్రముఖ శీతలపానీయ సంస్థ కోకాకోలా కొంప ముంచింది.

‘కోక్‌’ కొంప ముంచాడు

రొనాల్డో మాటతో శీతలపానీయ

 సంస్థకు రూ. 29వేల కోట్ల నష్టం!


బుడాపెస్ట్‌: ఒక్క మాట.. సాకర్‌ స్టార్‌, పోర్చుగల్‌ జట్టు కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట ప్రముఖ శీతలపానీయ సంస్థ కోకాకోలా కొంప ముంచింది. సంస్థ బ్రాండ్‌ వాల్యూను దారుణంగా పడిపోయేలా చేసి.. కంపెనీకి రూ.29 వేల కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. యూరో కప్‌లో భాగంగా మంగళవారం హంగరీ జట్టుతో మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న రొనాల్డో తన ముందు టేబుల్‌పై ఉన్న రెండు కోకాకోలా బాటిళ్లను పక్కకు నెట్టేసి.. మంచినీళ్లు తాగండి అని  సలహా ఇచ్చిన సంగతి గుర్తుందిగా! రొనాల్డో చేసిన ఈ వ్యాఖ్యతో కోకాకోలా మార్కెట్‌ విలువ దారుణంగా పడిపోయింది.


స్టాక్‌ మార్కెట్లో కంపెనీ షేర్‌ విలువ 1.6 శాతం మేర పడిపోవడంతో సంస్థకు చెందిన దాదాపు రూ. 29వేల కోట్ల సంపద ఆవిరైంది. షాక్‌కు గురైన కోకాకోలా సంస్థ ఓ ప్రకటనైతే చేసింది. ‘ప్రతి ఒక్కరికి తమకంటూ ప్రత్యేక అవసరాలు, అభిరుచులు ఉంటాయి. తమకు నచ్చిన పానీయాన్ని వారు ఎంపిక చేసుకోవచ్చు’ అని పేర్కొంది. చిత్రం ఏమిటంటే 2006లో కోకాకోలా కంపెనీకి రొనాల్డో ప్రచారకర్తగా వ్యవహరించాడు. అప్పట్లో ఆ ప్రకటనకు అతడు పెద్ద మొత్తంలో పారితోషికం కూడా తీసుకున్నాడు. 

Updated Date - 2021-06-17T09:20:22+05:30 IST