సంజన, రాగిణి ఫోన్‌లో అశ్లీల వీడియోలు

ABN , First Publish Date - 2020-10-01T08:56:42+05:30 IST

కన్నడ హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేది మెడకు సెక్స్‌ రాకెట్‌ కేసు కూడా చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి...

సంజన, రాగిణి ఫోన్‌లో అశ్లీల వీడియోలు

  • వ్యభిచారానికి వాట్సాప్‌ గ్రూపు కూడా నిర్వహణ
  • కన్నడ హీరోయిన్ల మెడకు సెక్స్‌ రాకెట్‌ ఉచ్చు
  • ఇప్పటికే మాదక ద్రవ్యాల కేసులో రిమాండ్‌
  • రోజుకో మలుపు తిరుగుతున్న డ్రగ్‌ మాఫియా కేసు


బెంగళూరు, సెప్టెంబరు 30: దేశవ్యాప్తంగా కలకలం రేపిన శాండిల్‌వుడ్‌ డ్రగ్‌ మాఫియా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కుని జైలు జీవితం గడుపుతున్న కన్నడ హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేది మెడకు సెక్స్‌ రాకెట్‌ కేసు కూడా చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాదక ద్రవ్యాల కేసులో భాగంగా ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్న సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) పోలీసులు విస్తుపోయే విషయాలు గుర్తించారు. సంజన, రాగిణి మొబైల్స్‌ను పరిశీలించగా.. వాటిలో ఇతర నటీనటుల అశ్లీల వీడియోలు, నగ్న సెల్ఫీ ఫొటోలు కనిపించడంతో కంగుతిన్నారు. దీంతో డ్రగ్స్‌తోపాటు సెక్స్‌ రాకెట్‌తోనూ సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో మరింత లోతైన విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సంజన, రాగిణి.. సెక్స్‌ రాకెట్‌కు సంబంధించి ఓ వాట్సాప్‌ గ్రూపును కూడా నిర్వహించేవారని, డ్రగ్స్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆ గ్రూపును తొలిగించారని పోలీసులు గుర్తించారు. సాంకేతిక నిపుణుల సాయంతో ఆ గ్రూపులోని సమాచారాన్ని రికవరీ చేశారు. ఆ గ్రూపులో ఉన్న వారందరికీ నోటీసులు పంపి వారిని కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ విచారణ మొదలైతే మరిన్ని షాకింగ్‌ విషయాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. 

Updated Date - 2020-10-01T08:56:42+05:30 IST