Advertisement
Advertisement
Abn logo
Advertisement

పొర్లుకట్టల గండ్లను త్వరగా పూడ్చండి : కలెక్టర్‌

జొన్నవాడలో వరదలకు గండ్లుపడిన పెన్నా పొర్లుకట్టలను పరిశీలిస్తున్న కలెక్టర్‌, తదితరులు

బుచ్చిరెడ్డిపాళెం,నవంబరు27: పెన్నా వరదలతో పొర్లుక ట్టలకు పడిన గండ్లను త్వరగా పూడ్చాలని కలెక్టర్‌ చక్రధర్‌ బాబు నీటిపారుదల శాఖ  అఽధికారులను ఆదేశించారు. శనివారం జొన్నవాడలో పొర్లుకట్టకు పడిన గండ్లను ఆయన పరిశీలించారు. కలెక్టర్‌ వెంట జేసీ హరేందిర ప్రసాద్‌, ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, వీఆర్వో మహేష్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ కృష్ణమోహన్‌, డీఈఈ మధు, పీఆర్‌ జిల్లా అధికారులు, ఏఈ శ్రీనివాసులురెడ్డి, వవ్వేరు బ్యాంకు చైర్మన్‌ సూరా శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. 

 పెనుబల్లిలో పరిశీలన

మండలంలోని పెనుబల్లి హైస్కూల్లో వరద ప్రవాహానికి కూలిన ప్రహరీని, గ్రామంలోని గిరిజనుల ఇళ్లను, పెద్దకాలువ కరకట్టలను, రోడ్లను కలెక్టర్‌ పరిశీ లించారు.  నష్టాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 


 సాయం కొందరికేనా ?


సార్‌.. కొంతమందికేనా ? వరదసాయం అంటూ పెనుబల్లిలో కలెక్టర్‌ ఎదుట ఎంపీటీసీ సభ్యుడు సీహెచ్‌ నారాయణ, పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.  తమ బాధలను ఆయనకు మొరపెట్టుకున్నారు. స్పందించిన కలెక్టర్‌ బాధితులందరికీ సాయం అందేలా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

 రొయ్యలోళ్లే ముంచేశారు.. సార్‌ !

ఇందుకూరుపేట, నవంబరు 27 : ‘రొయ్యల సాగు  చేస్తున్న యజమానుల వల్లే పెన్నా కట్టలు తెగాయి. 30 ఏళ్ల తర్వాత వీరి పుణ్యమా.. అని ఊరు వదిలి,  ప్రాణాలతో కనిపిస్తున్నాం’. అని మండలంలోని రాజుకాలనీ గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. శనివారం కలెక్టర్‌తోపాటు  జేసీ హరేందర ప్రసాద్‌, ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, ఇరిగేషన్‌ ఏఈ కృష్ణమోహన్‌లు  పెన్నా ముంపు నకు గురైన గంగపట్నం, ముదివర్తిపాలెం, రాముడుపా ళెం, రాజుకాలనీ గ్రామాల్లో పర్యటించారు. నష్టాలను స్వ యంగా చూసి, బాధితులనడిగి వివరాలు తెలుసుకున్నా రు. మోకాలులోతు నీళ్లలో పెన్నాలో నడుస్తూ, చెప్పులు కూడా లేకుండా, బురదకు జారుతున్నా లెక్క చేయకుండా వారు బాధితులను కలుసుకున్నారు.   పక్కా ఇళ్లు, కూలిన శ్లాబ్‌ ఇళ్లు, తెగిన పెన్నా కట్టలను బాధితులు అధికారులకు చూపించారు. కాగా నష్టపరిహారం రూ.2వేలు, హౌసింగ్‌ డబ్బులు, బియ్యం ఇంకా ఎందుకు పంపిణీ చేయలేదని  రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ మందలించారు. 

 ప్రతి బాధిత కుటుంబానికి చేయూత

 వరదలకు నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. శనివారం ముదివర్తిపాలెంలో  ఆయన విలేకరులతో మాట్లాడారు. వరద బాధిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిప దికన సహాయక పనులు చేపడుతున్నామన్నారు. నష్టపోయిన 48,900 మం దికి 25కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. 672 ఇళ్లు దెబ్బతిన్నాయని, ఆ కుటుంబాలకు రూ.95వేలు నష్టపరిహారం వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. 


 నేడు ప్రత్యేక బృందాల రాక


ఆదివారం నుంచి కేంద్ర ప్రత్యేక బృందాలు జిల్లాలో  పర్యటించి, జరిగిన నష్టాలను పరిశీలించి ప్రభుత్వాలకు నివేదిక ఇస్తాయన్నారు.

 దెబ్బతిన్న రోడ్ల పరిశీలన

నెల్లూరురూరల్‌, నవంబరు 27 :  ఇటీవల వరద తాకిడికి దెబ్బతిన్న రోడ్లను కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు పరిశీలించారు. నెల్లూరు - తాటిపర్తి రహదారిలో జొన్న వాడ మలుపు వద్ద పూర్తిగా దెబ్బతిన్న నరసింహపురం రోడ్డును కలెక్టర్‌ శనివారం వివిధ శాఖల అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. జొన్నవాడ రేవు వద్ద దెబ్బతిన్న రహదారి కారణంగా ఏర్పడిన ఇబ్బందులు, నష్టంపై వివిధ శాఖల అధికారులతో ఆయన అంచనాలు తయారు చేయించారు. ప్రస్తుతం తాత్కాలికంగా రవాణా నడుస్తున్నా శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపుతామ న్నారు. 


ఇందుకూరుపేట : రాజుకాలనీ గ్రామంలో నష్టాల పరిశీలనకు బురదలో వెళుతున్న కలెక్టర్‌


నెల్లూరు రూరల్‌ : జొన్నవాడ మలుపువద్ద దెబ్బతిన్న రోడ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు


Advertisement
Advertisement