పోరాటాలతోనే సమస్యల పరిష్కారం!

ABN , First Publish Date - 2022-05-19T05:49:18+05:30 IST

ఉపాధ్యా య సమస్యల పరిష్కారంతో పా టు సీపీఎస్‌ రద్దు చేసే వరకు పో రాడడమే బీటీఏ ప్రధాన లక్ష్యమని బహుజన టీచర్స్‌ అసోషియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పల్లం వేణుగోపాల్‌ స్పష్టం చేశారు.

పోరాటాలతోనే సమస్యల పరిష్కారం!
సీపీఎస్‌ రద్దుకు పోరాడుతాం అంటున్న బీటీఏ నేతలు


రాయచోటిటౌన్‌, మే 18:
ఉపాధ్యా య సమస్యల పరిష్కారంతో పా టు సీపీఎస్‌ రద్దు చేసే వరకు పో రాడడమే బీటీఏ ప్రధాన లక్ష్యమని బహుజన టీచర్స్‌ అసోషియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పల్లం వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. బుధవారం రాయచోటి పట్టణంలోని డైట్‌ కేంద్రంలో అన్నమయ్య జిల్లా బీటీఏ కార్య టవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్‌తో రిటైర్మెంట్‌ త ర్వాత చాలీచాలని పెన్షన్‌తో భారంగా గడిపే పరిస్థితులు రాబోతున్నాయన్నారు.  అనంతరం  జిల్లా బహుజన టీచర్స్‌ అసోషియేషన్‌ నూతన కమిటీని రాష్ట్ర పరిశీలకులు పల్లం రామచంద్ర, ఆదినారాయణ, చిట్టేటి రమేష్‌, చిన్నయ్య సమక్షంలో ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా ర మణయ్య, గౌరవ సలహాదారు సుధారాణి, జిల్లా అధ్యక్షుడుగా రాయచోటి రవిశంకర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్‌రజాక్‌, జిల్లా కోశాధికారిగా జ్యోతిబాబు, సీపీఎస్‌ కన్వీనర్‌గా పూసపాటి రెడ్డెయ్య, అసోషియే ట్‌ అద్యక్షుడు మహేశ్వరయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌గా నాగన్న, ఏవీ రమణ, ఆడిట్‌ సెక్రటరీగా ఈశ్వరయ్య, ప్రచార కార్యదర్శిగా శేఖర్‌, మహిళా కార్యదర్శిగా నిర్మలకుమారి, ఉపాధ్యక్షులు సిరోజ్‌, పోలారమణ, కార్యదర్శులుగా బద్దూ నాయక్‌, ఉత్తన్న, లీగల్‌ అడ్వైజర్‌గా రవిశంకర్‌ను ఎన్నుకున్నారు.

Updated Date - 2022-05-19T05:49:18+05:30 IST