Advertisement
Advertisement
Abn logo
Advertisement

జనాగ్రహ దీక్షలు సిగ్గుచేటు: టీడీపీ


ఆత్మకూరు, అక్టోబరు 21: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న వైసీపీ నాయకులు జనాగ్రహ దీక్షలను చేపట్టడం సిగ్గుచేటని ఆత్మకూరు మేజర్‌ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ, సీనియర్‌ అడ్వకేట్‌ గోవిందరెడ్డి పేర్కొన్నారు. గురువారం నూతన టీడీపీ కార్యాలయం వద్ద వారు మాట్లాడారు. వైసీపీ నాయకుల డ్రగ్స్‌ మాఫియాపై ప్రశ్నించిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు పవిత్రమైన టీడీపీ కార్యాలయంపై దాడులు చేయడం హేయనీయకరమని అన్నారు. పోలీసుల సహకారంతో వైసీపీ గుండాల దౌర్జాన్యాలు, దాడులు అధికమయ్యాయమని మండిపడ్డారు. టీడీపీ నాయకుల విమర్శలకు తట్టుకోలేక దాడులకు తెగబడటం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో పబ్బం గడుపుకొనే బూతుల మంత్రులతో నిత్యం చంద్రబాబు, లోకే్‌షలపై విమర్శలు చేస్తున్న వారిని ఏం చేయాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని నిలదీశారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలో దౌర్భాగ్యంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన తుగ్లక్‌కు మించి శాడిస్ట్‌ పాలన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎన్ని భయభ్రాంతులకు గురిచేసినా.. టీడీపీ నాయకుల సంకల్పం చెక్కుచెదరని స్పష్టం చేశారు. అదేవిధంగా 75లక్షల సభ్యత్వాలు కలిగిన టీడీపీ కార్యకర్తలు గాండ్రించి ఉమ్మేస్తే వైసీపీ కొట్టుకుపోతోందని విమర్శించారు. ఏదిఏమైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు మట్టికరిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు గిరిరాజు, వేణుగోపాల్‌, అబ్దుల్లాపురం బాషా, ఫకృద్దీన, రామమూర్తి, షాబుద్దిన, సుబ్బారాజు, నాగూరు, పీ.కలిముల్లా, అన్వర్‌, రామకృష్ణ ఉన్నారు.


Advertisement
Advertisement