జనాభా నియంత్రణ.. అన్ని మతాలకు ఒకేలా ఉండాలి: యోగి

ABN , First Publish Date - 2022-07-12T08:10:18+05:30 IST

దేశంలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు.

జనాభా నియంత్రణ.. అన్ని మతాలకు ఒకేలా ఉండాలి: యోగి

లఖ్‌నవూ, జూలై 11: దేశంలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. అయితే, ఆ కార్యక్రమం అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండాలన్నారు. జనాభా నియంత్రణపై అవగాహన పెంచడం వల్ల కేవలం మూలవాసుల జనాభా మాత్రమే తగ్గితే దుష్పరిణామాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. దేశంలో కొన్ని మతాల్లో జనాభా వృద్ధి రేటు మిగతా మతాలతో పోలిస్తే ఎక్కువగా ఉందని చెప్పారు. సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా యోగి.. ‘జనాభా నియంత్రణ పక్షం’ పేరుతో యూపీలో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనాభా పెరగడం ఒకరకంగా చూస్తే మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2022-07-12T08:10:18+05:30 IST