Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీతోనే ప్రజారంజక పాలన

టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద


బుచ్చెయ్యపేట, డిసెంబరు 2: తెలుగుదేశం ప్రభుత్వ పాలనతోనే ప్రజారంజక పాలన సాధ్యమని పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. కొండపాలెం, సీతయ్యపేట గ్రామాల్లో గురువారం జరిగిన పార్టీ గౌరవ సభల్లో ఆయన ప్రసంగించారు. వైసీపీ పాలనలో గ్రామాభివృద్ధి తిరోగమనంలో పయనిస్తున్నదన్నారు. ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఓటీఎస్‌ పేరుతో వేలాది రూపాయలను బలవంతంగా వసూలు చేయడం దుర్మార్గమన్నారు. ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడంతో పంచాయతీల్లో కనీసం పారిశుధ్య పనులు చేపట్టలేని దుస్థితి దాపురించిందన్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధే తప్పితే, రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి మచ్చుకైనా కానరావడం లేదన్నారు. ప్రధానంగా రహదారుల దెబ్బతినడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని వాపోయారు. పార్టీ చోడవరం నియోజవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌.రాజు మాట్లాడుతూ, జగన్‌రెడ్డి ముఠా దుశ్శాసన పర్వం, బూతులపై తగిన గుణపాఠం చెప్పాలని, రానున్న సార్వత్రిక ఎన్నికలో తిరిగి సీఎంగా చంద్రబాబు గెలిపించి గౌరవ శాసనసభకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ముచ్ఛకర్ల భవానీ, వజ్రపు ఇందిర, సుంకర సూరిబాబు, ఎంపీటీసీలు వియ్యపు లక్ష్మి, కె.శ్రీనివాసరావు, యల్లపు జగ్గాయ్యమ్మ, మాజీ ఎంపీపీ ఎంవీవీ సత్యనారాయణ, టీడీపీ మండల నాయకులు జి.కోటేశ్వరరావు, కె.రవికుమార్‌, వజ్రపు శ్రీను, కె.సత్యనారాయణ, ఎం.బుజ్జి, వి.అప్పలనాయుడు, వి.అప్పారావు, డి.అప్పలనాయుడు, ఎస్‌.శ్రీరామూర్తి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement