మిద్దె తోటలకు ఆదరణ

ABN , First Publish Date - 2022-05-28T04:51:55+05:30 IST

ఇంటి ఆవరణలో స్థలం లేకపాయె.. ఉండి ఉంటే మనమూ కూరగాయలు పండ్లమొక్కలు పెంచుకునేవారం అని అలోచించే వారికి మిద్దెతోట ఏర్పాటుతో కలలు సాకారమౌతున్నాయి.

మిద్దె తోటలకు ఆదరణ
ఘట్‌కేసరలో ఇంటిపై ఏర్పాటు చేసిన మిద్దెతోట


  • ఇంటికి అవసరమైన తాజా కూరగాయలు, ఆకుకూరలు లభ్యం
  • వివిధ రకాల పండ్లు అందుబాటులో..
  • పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం
  • ప్రాణాంతక వ్యాధులకు చెక్‌ 

ఇంటి ఆవరణలో స్థలం లేకపాయె.. ఉండి ఉంటే మనమూ కూరగాయలు పండ్లమొక్కలు పెంచుకునేవారం అని అలోచించే వారికి మిద్దెతోట ఏర్పాటుతో  కలలు సాకారమౌతున్నాయి. ఇంటి పరిసరాలలో గజం జాగా లేకపోయినా ఇంటికి కావలసిన వివిధ రకాల తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మిద్దెతోటల సాగుతో పొందుతున్నారు 

ఘట్‌కేసర్‌, మే 27 : ప్రధానంగా ఇళ్ల స్థలాల ధరలు ఆకాశానంటుతుండటంతో తక్కువ స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకునేవారికి సైతం మిద్దెతోటలు ఏర్పాటు చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం లక్షన్నర రూపాయాలు వెచ్చిస్తే 300 చదరపు గజాల ఇంటి టెర్ర్‌సపైన వివిధ రకాల మొక్కలు పెంచుకోవచ్చు. దీంతో నిత్యం ఇంటికి అవసరమైన కూగాయాలు, ఆకుకూరలు రసాయన మందులు వాడకుండా పండిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీ పరిఽధిలోని నారపల్లిలోని బాబానగర్‌లో, ఘట్‌కేసర్‌లోని ప్రధాన రహదారిలో, ఎన్‌ఎ్‌్‌ఫసీనగర్‌లో ఈ మిద్దెతోటలు సాగుచేస్తూ అందరిని అకట్టుకుంటున్నారు. హైబ్రీడ్‌ విత్తనాలు కాకుండా నాటు మొక్కలను పెంచుతున్నారు. 

అనేక లాభాలు

మిద్దెతోటల పెంపకంతో అనేక ప్రయోజనాలున్నాయి. మార్కెట్‌లో వచ్చే కూరగాయలు వివిధ రకాల రసాయన అవశేషాలు ఉండడంతో పాటు రెండు మూడు రోజల తరువాత కొనుగోలుదారుడికి చేరుతుంటాయి, అయితే మిద్దె తోటల ఏర్పాటుతో  మనకు కావాల్సిన తాజా కూరగాయలు  ఎప్పటికప్పుడు తెంపుకునిక్షణాల్లో వండుకునే అవకాశం ఉంటుంది, సేంద్రియ ఎరువులను వాడుతూ సొంతంగా పండించామనే సంతృప్తి కలుగుతోంది. 

ఆహ్లాదకరమైన వాతావరణం

మిద్దెతోట సాగుతో ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు లభించడంతోపాటు కళ్లముందు పచ్చదనం ఉంటుంది. సాయంత్రం వేళలో మొక్కల మధ్య కూర్చొని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. పట్టణాల్లో చుట్టు బహుల అంతస్తుల ఇళ్లుతప్ప ఎక్కడ పచ్చదనం కనిపించదు. మిద్దెతోట సాగుతో ఇంటిపైన పచ్చదనం ఎలాసాధ్యం అన్ని అశ్చర్యంతోపాటు అలోచనలను  రేకెత్తిస్తుంది.

కూరగాయలు,  పండ్లమొక్కలు 

టెర్ర్‌సపైన టమాట, వంకాయ, బెండ, దొండ, క్యాబేజి, కాకర, బీర. సోర, మునగ, దోస, చిక్కుడు, పాలకూర, గోంగూర, మెంతి, పూదీన, కొత్తిమీర, బచ్చలికూర, తోటకూరతోపాటు జామ, అరటి, పనస. నారింజ, నిమ్మ, బత్తాయి, బొప్పాయి. వంటి పండ్లమొక్కలను సైతం పెంచుతూ తాజా కూరగాయలు, ఆకుకూరలతో పాటు పండ్లను పొందుతున్నారు.  నీటి సౌకర్యం ఉండి నిత్యం గంట సమయం కేటాయిస్తే సరిపోతుందని మిద్దెతోటలు సాగుచేస్తున్న వారు సూచిస్తున్నారు.

దోమల నివారణ

ఎడాది పొడవున దోమలతో ఇబ్బంది పడుతున్న పట్టణ. గ్రామీణ ప్రాంత ప్రజలకు మిద్దెతోటల సాగుతో దోమల తీవ్రతను తగ్గించుకోవచ్చు ఇందులో లెమన్‌గ్రాస్‌, బంతి, తులసీ, పూదీన సాగుతో దోమల బెడద పూర్తిగా తగ్గిపోతుందని మిద్దెతోటల పెంపకందారులు సూచిస్తున్నారు. నిత్యం ఉదయం లేచి వాకింగ్‌ చేయడం కంటే ఇంటిపై మొక్కలకు నీరు పట్టడం కలుపు మొక్కలు తీయడం వంటి పనులతో శరీరానికి తగిన వ్యాయమం లభిస్తుందని సూచిస్తున్నారు. 

ఇంటిపైనే కూరగాయలు 

ఇంటిపైన టబ్బులతో ఏర్పాటు చేసిన మిద్దెతోటతో అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు అందుతున్నాయి. ఎండల తీవ్రతకు దిగుబడి కొద్దిగా తగ్గింది. ఆకుకూరలకు కొదవలేదు. చిన్న పిల్లలకు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎలా పండుతాయో తెలుస్తుంది.

                                               - చందుపట్ల వినోద, ఇంటి యజమానురాలు ఘట్‌కేసర్‌

కూతురు పుట్టిన రోజు చేయకుండా మిద్దెతోట ఏర్పాటు

రెండున్నరేళ్లకిత్రం నా కూతురు ఆద్య పుట్టిన రోజు వేడుకలు జరుపకుండా ఆ డబ్బుతో ఇంటిపైన మిద్దెతోటను ఏర్పాటు చేయించా. దీంతో నిత్యం ఇంటికి కావాల్సిన తాజా కూరగాయాలు, ఆకుకూరలతో లభ్యమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తోంది, ప్రతిరోజు ఉదయం గంట సమయం కేటాయించడంతో శారీరక వ్యాయమంతో పాటు కూరగాయల సమస్య తీరింది. 

                                                                 - చందుపట్ల నవజీవన్‌రెడ్డి, ఘట్‌కేసర్‌

దీర్ఘకాలం మన్నె పైబర్‌ టబ్బులు

పైౖబర్‌ టబ్బులు దీర్ఘకాలం మన్నికగా ఉంటాయి. పస్తుతం ఐదు రకాలు టబ్బులు అందుబాటులో ఉన్నాయి. రంగురంగులలో ఆకర్షనీయంగా ఉంటాయి, ప్రతిఒక్కరు మిద్దెతోటలపై దృష్టి సారిస్తే అనేక రకాల ప్రాణాంతక వ్యాధులు దరిచేరవు.  ప్రస్తుతం రసాయన మందులతో పండించిన కూరగాయలు, ఆకుకూరలతో క్యాన్సర్‌ ముప్పు పొంచిఉంది.  మిద్దెతోట సాగుతో దాని నుంచి రక్షించుకోవచ్చు.

                                             - పిట్టల శ్రీశైలం మూసీ పైబర్‌ టబ్బుల సంస్థ యాజమాని

Updated Date - 2022-05-28T04:51:55+05:30 IST