‘నాసిరకంగా వెంకంపల్లి బీటీ రోడ్డు పనులు’

ABN , First Publish Date - 2021-06-11T05:22:02+05:30 IST

మండలంలోని తాండూరు- వెంకంపల్లి బీటీ రోడ్డు నిర్మాణం పనుల్లో నాణ్యత లోపించిందని, పనులను కాంట్రాక్టర్‌ నాసిరకంగా చేపడుతున్నా సంబంధిత ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు ఏ మాత్రం పట్టించుకోవ డం లేదంటూ నాగిరెడ్డిపేట జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, ఎంపీపీ రాజ్‌దాస్‌, వెంకం పల్లి సర్పంచ్‌ సుభాకర్‌రెడ్డి ఆరోపించారు.

‘నాసిరకంగా వెంకంపల్లి బీటీ రోడ్డు పనులు’

నాగిరెడ్డిపేట, జూన్‌ 10: మండలంలోని తాండూరు- వెంకంపల్లి బీటీ రోడ్డు నిర్మాణం పనుల్లో నాణ్యత లోపించిందని, పనులను కాంట్రాక్టర్‌ నాసిరకంగా చేపడుతున్నా సంబంధిత ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు ఏ మాత్రం పట్టించుకోవ డం లేదంటూ నాగిరెడ్డిపేట జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, ఎంపీపీ రాజ్‌దాస్‌, వెంకం పల్లి సర్పంచ్‌ సుభాకర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం వెంకంపల్లి గ్రామం వద్ద జరుగుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను వారు పరిశీలించారు. తాండూరు నుంచి వెంకంపల్లి మీదుగా ముద్దాపురం వరకు 2017వ సంవత్సరంలో రూ.20కోట్ల91 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు మంజూరైంది. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా ప్రస్తుతం వెంకంపల్లి గ్రామ సమీపంలో బీటీ రోడ్డు పనులు జరుగు తున్నాయని, నాసిరకంగా పనులు చేపడుతున్న సంబంధిత కాంట్రాక్టర్‌కు చెల్లిం  చే బిల్లులను ఆర్‌అండ్‌బీ అధికారులు నిలిపి వేయాలని డిమాండ్‌ చేశారు. రోడ్డు నాణ్యత లోపంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపా రు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వెంట వెంకంపల్లి సర్పంచ్‌ సుభాకర్‌ రెడ్డి, మండల కో-ఆప్షన్‌ సభ్యులు ఎండీ షాహెద్‌ పాషా ఉన్నారు. 

Updated Date - 2021-06-11T05:22:02+05:30 IST