ఆర్బీకే నిర్మాణాల్లో నాణ్యతాలోపం

ABN , First Publish Date - 2021-07-23T06:10:39+05:30 IST

రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పాత భవనాల రాళ్లతోనే నిర్మాణాలు చేస్తున్నా... పర్యవేక్షణాధికారులు మాత్రం అంతా బాగుందంటూ కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్‌ ఇచ్చేస్తున్నారు.

ఆర్బీకే నిర్మాణాల్లో నాణ్యతాలోపం
వీ కొత్తకోట గ్రామంలో పాత రాయితో నిర్మించిన గోడ


పాత రాళ్లతోనే కట్టడాలు

విడపనకల్లు, జూలై 22 : రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పాత భవనాల రాళ్లతోనే నిర్మాణాలు చేస్తున్నా... పర్యవేక్షణాధికారులు మాత్రం అంతా బాగుందంటూ కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్‌ ఇచ్చేస్తున్నారు. గ్రామాల్లో కళ్లెదుటే జరుగుతున్న నాసిరకం పనులను చూస్తున్న జనం మాత్రం ముక్కున వేలేసుకోవడం వారి వం తైంది. మండలంలోని వీ కొత్తకోట గ్రామంలో రైతు భరోసా కేంద్రం నూత న భవన నిర్మాణంలో ఇదే తంతు చోటుచేసుకుంది. కాంట్రాక్టర్‌ నిబంధన లకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పాత రాయితోనే నిర్మాణాన్ని కానిచ్చేస్తు న్నారు. కాంట్రాక్టర్‌ ఈ భవన నిర్మాణానికి కొత్త రాయితో కాకుండా, గ తంలో పంచాయతీ కార్యాలయానికి వాడిన రాయినే తిరిగి రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి వాడుతున్నారు. పర్యవేక్షణ అధికారులు ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. సచివాలయ నిర్మాణం కోసం పాత పంచాయతీ కార్యాలయాన్ని తొలగించారు. అందుకు వినియోగించిన పాత రాయి, మట్టిని ఊరి చివరకు తరలించారు. కాని ఆ రాయినే తిరిగి తెచ్చి రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి వాడుతున్నారు. ఇంత జరుగుతు న్నా అధికారులు చూస్తూ కూర్చున్నారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం విమర్శలపాలవుతోంది.


Updated Date - 2021-07-23T06:10:39+05:30 IST