నాణ్యతలేని నిర్మాణం.. కూలిన కల్వర్టు

ABN , First Publish Date - 2021-04-19T05:42:48+05:30 IST

కంది మండలంలోని కాశీపూర్‌లో రెండు సంవత్సరాల క్రితం ఓ కాంట్రాక్టరు పోశమ్మకుంట నుంచి అలుగుపోసే వరదకాలువ కల్వర్టు పనులను కాంట్రాక్టు తీసుకున్నాడు.

నాణ్యతలేని నిర్మాణం.. కూలిన కల్వర్టు
కంది మండలంలోని కాశీపూర్‌లో కూలిన వరద కాలువ కల్వర్టు

కంది, ఏప్రిల్‌ 18 : కంది మండలంలోని కాశీపూర్‌లో రెండు సంవత్సరాల క్రితం ఓ కాంట్రాక్టరు పోశమ్మకుంట నుంచి అలుగుపోసే వరదకాలువ కల్వర్టు పనులను కాంట్రాక్టు తీసుకున్నాడు. కాగా కల్వర్టును నాణ్యత లేకుండా నిర్మించడంతో ఇటీవల ఆ కల్వర్టు కూలింది. కూలిన కల్వర్టు శిథిలాలను అలాగే కాల్వలోనే వదిలేశారు. లక్షల రూపాయల ప్రజాధనంతో చేపట్టిన వరదకాలువ నిర్మాణం మున్నాళ్ల ముచ్చటే అయ్యిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా పట్టనట్లుగా వ్యవహరించడంతో వరదకాలువ నిరుపయోగంగా మారింది. కాగా గ్రామంలోని మురుగునీరును ఆ కాల్వలోకే వదలడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతుంది. అలాగే సదరు కాంట్రాక్టర్‌ కాశీపూర్‌లో ఇటీవల నిర్మించిన ఇతర పంచాయతీ పనుల నాణ్యతను కూడా పరీక్షించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు  కోరుతున్నారు.

Updated Date - 2021-04-19T05:42:48+05:30 IST