సమస్యలపై ఆరాతీస్తున్న వినుత
శ్రీకాళహస్తి, జనవరి 23: ధరల బాదుడుతో సామాన్యులు విలవిలలాడుతున్నారని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి వినుత అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు ఇతర ప్రాంతాల్లో ఆదివారం ఆమె పర్యటించారు. ప్రజలు, చిరు వ్యాపారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వినుత మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, విద్యుత్ బిల్లుల మోతతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కార్యక్రమంలో జనసేన నాయకులు భవానీశంకర్, మున్నా, కరీం, ప్రమోద్, రఫి, సురేష్, రవికుమార్, చందుచౌదరి, సలీం, తేజ, అశోక్, ప్రేమ్, శీను తదితరులు పాల్గొన్నారు.