నిరుపేదలెవరూ.. ఆకలితో అలమటించొద్దు

ABN , First Publish Date - 2021-07-27T06:31:02+05:30 IST

రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేదా ఆకలితో

నిరుపేదలెవరూ.. ఆకలితో అలమటించొద్దు
మేడ్చల్‌ మండల పరిషత్‌లో రేషన్‌కార్డులను పంపిణీ చేస్తున్న మంత్రి మల్లారెడ్డి

  • రేషన్‌ కార్డుల పంపిణీలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌/కీసర/మూడుచింతలపల్లి/శామీర్‌పేట/ఘట్‌కేసర్‌: రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేదా ఆకలితో అలమటించకూదనే అర్హులందరికీ రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతి అని, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. సోమవారం మేడ్చల్‌ మండల పరిషత్‌లో కొత్త రేషన్‌కార్డుల పంపిణీలో మంత్రి మాట్లాడారు. మేడ్చల్‌ మల్కా జ్‌గిరి జిల్లాలో 30,055 ఆహార భద్రత కార్డులను ఈనెల 30వ తేదీ వరకు పం పిణీ చేస్తామన్నారు. ఆగస్టు ఒకటి నుంచి కొత్త కార్డుదారులకు రేషన్‌ బియ్యం అందజేస్తామన్నారు. రేషన్‌ దుకాణాలనూ పెంచే యోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. 

కీసర మండలం చీర్యాల్‌లోని జయమోహన్‌ గార్డెన్‌లో కీసర, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల లబ్ధిదా రులకు మంత్రి రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటికే 4,94,609 కార్డులుండగా, కొత్తగా 30,055 కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. రేషన్‌ కార్డులు రాని వారికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. సోమవారం మూడుచింతలపల్లి, శామీర్‌పేట మండలాల్లోనూ ఆహార భద్రత కార్డులను మంత్రి మల్లారెడ్డి అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల 60వేల పైచిలుకు కొత్తరేషన్‌ కార్డులు అందజేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారన్నారు. ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో 233మందికి రేషన్‌ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి, మేడ్చల్‌ ఎంపీపీ పద్మ, మేడ్చల్‌, గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్లు మర్రి దీపిక, మద్దుల లక్ష్మి, ఎంపీడీవో శశిరేఖ, సర్సంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్‌ సురే్‌షరెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ వెంకటేష్‌, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర, మున్సిపల్‌ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, ప్రణీత, డీఎస్వో పద్మ, డీసీ ఎంఎస్‌ మధుకర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ సత్తిరెడ్డి, సొసైటీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ గౌరి, ఎంపీడీవో పద్మావతి, మూడుచింతలపల్లి ఎంపీపీ హారిక, శామీర్‌పేట ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుదర్శన్‌, జగదీ్‌షగౌడ్‌, ఘట్‌కేసర్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ జంగమ్మ, తహసీల్దార్‌ విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు పావని జంగయ్య యాదవ్‌, కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్లు మాధవరెడ్డి, రెడ్యా నాయక్‌, సొసైటీ చైర్మన్‌ రాంరెడ్డి పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-27T06:31:02+05:30 IST