పేదల పక్షపాతి సీఎం కేసీఆర్‌ : విప్‌ గంప గోవర్ధన్‌

ABN , First Publish Date - 2021-07-27T06:19:00+05:30 IST

పేదలపక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశం హాల్‌లో కామారెడ్డి నియోజకవర్గంలోని లబ్దిదారులకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

పేదల పక్షపాతి సీఎం కేసీఆర్‌ : విప్‌ గంప గోవర్ధన్‌
మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

కామారెడ్డి, జూలై 26: పేదలపక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశం హాల్‌లో కామారెడ్డి నియోజకవర్గంలోని లబ్దిదారులకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ కిట్టు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం చేయించుకున్న మహిళలకు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లవాడు పుడితే రూ.12 వేలు ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. పేదల కడుపు నింపే యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. నూతన కార్డుదారులకు ఆగస్టు నుంచి రేషన్‌ పంపిణీ చేస్తారని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో బీడీ కార్మికులకు ప్రభుత్వం పింఛన్‌ ఇస్తుందని తెలిపారు. పేదింటి మహిళలకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలతో ఆర్థిక తోడ్పాటును అందిస్తోందని అన్నారు. ఇందులో ఎంపీ బీబీపాటిల్‌, కలెక్టర్‌ శరత్‌, ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ వెంకటమాధవరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్‌పర్సన్‌ ఇందుప్రియ, తదితరులున్నారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల అందజేత

కామారెడ్డి టౌన్‌: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను సోమవారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ఇప్పటివరకు 828మందికి రూ.5కోట్ల 7లక్షల 62వేల 900 చెక్కులను పంపిణీ చేశామన్నారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికిచెందిన అల్లెరాజు, రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన రేకుల పల్లి మహిపాల్‌ రెడ్డి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల ప్రమాదభిమాను అందజేసినట్లు తెలిపారు. 

Updated Date - 2021-07-27T06:19:00+05:30 IST