భోజనం తినలేం..

ABN , First Publish Date - 2021-04-11T05:19:49+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉండడంతో విద్యార్థులు తినడం లేదు.

భోజనం తినలేం..
అధ్వాన భోజనం చూపుతున్న విద్యార్థులు

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అధ్వానం

40 శాతం మంది మాత్రమే తింటున్నారు

పట్టించుకోని ఏజెన్సీలు


దేవరపల్లి, ఏప్రిల్‌ 10: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉండడంతో విద్యార్థులు తినడం లేదు. దేవరపల్లి మండలంలో 45 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 6960మంది విద్యార్థులు ఉన్నారు. 40శాతం మంది పిల్లలు మాత్రమే మధ్యాహ్న భోజనం చేస్తుండగా మిగిలిన విద్యార్థులు ఇంటికి వెళ్లిపోతున్నారు. స్కూల్లో భోజనాలు రుచికరంగా లేకపోవడం ఉడకని కూరలు, అధ్వానంగా కిచిడి, పులిహోర, పాడైన కోడిగుడ్లు తినడానికి భయపడుతున్నారు. తిన్నా వాంతులు అవుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.


గతంలో ఏక్తశక్తి ఫౌండేషన్‌ ద్వారా భోజనం సరఫరా అయ్యేదని, అప్పుడు అన్నంలో బల్లులు, పురుగు ఉండడం, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందో ళన చేశారు. ప్రస్తుతం కాకినాడ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా భోజనం సరఫరా చేస్తున్నారని మళ్లి అదే తీరులో ఉండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్థానిక మధ్యాహ్నా భోజన కార్యకర్తలకు అప్పగించడం మంచిదని భావిస్తున్నారు. దేవరపల్లిలో 600 మంది విద్యార్థులు ఉండగా సుమారు వంద మంది మాత్రమే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. దుద్దుకూరులో 595మంది విద్యార్థులుం డగా 250 మంది, రంగరాయపాలెంలో 71 మంది విద్యార్థులుండగా పది నుంచి 20 మంది మాత్రమే మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు చెబుతున్నారు. 


త్యాజంపూడి జడ్పీహెచ్‌ హైస్కూల్‌లో శనివారం విద్యార్థులు ఎవరూ భోజనం చేయలేదు. ముద్దైన అన్నం, రుచిలేని కూరలు, పాడైన కోడిగుడ్లు వడ్డించడంతో విద్యార్థులు భోజనం చేయకుండ వదిలే శారు. 260మంది విద్యార్థులు ఉండగా కనీసం 20 మంది కూడా పాఠశాలలో భోజనాలు చేయడం లేదన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నిసార్లు మధ్యాహ్నా భోజన సరఫరా చేసే ఏజెన్సీకి, విద్యాశాఖ అధికారులకు, ప్రజా ప్రతినిధుల చెప్పినప్పటికి పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ ఉపసర్పంచ్‌ కుసులూరి వెంకట సతీష్‌ పాఠశాల సందర్శించి మధ్యాహ్న భోజనాలు పరిశీలించారు. భోజనాలు బాగుండకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం మంచి ఉద్ధేశంతో పథకాన్ని అమలు చేస్తునప్పటికి మధ్యాహ్నా భోజనాలు ఏజెన్సీ ద్వారా చెడ్డ పేరే వస్తుందని ఆ ఏజెన్సీలను రద్దుచేసి స్థానిక మహిళలకు మధ్యాహ్నా భోజన పథకాన్ని అప్పగించాలని కోరారు.


పట్టించుకోవడం లేదు

మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందని ఏజె న్సీకి ఎన్నిసార్లు  ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. ఏజెన్సీ రద్దుచేసి పూర్వపు పద్ధతిలోనే స్థానికులకు ఇవ్వాలి.

యు.శంకరుడు, యూటీఎఫ్‌ నాయకుడు 


వడ్డించడమే బాధగా ఉంది

అధ్వానంగా ఉన్న భోజనం పిల్లలకు వడ్డిం చడమే బాధగా ఉంది. గతంలో మేం వండి రుచి కరమైన భోజనాలు పెట్టే వారం. ఈ భోజనం తినడం కష్టమే..

దుగ్గిన మాణిక్యం, కార్యకర్త


తింటే వాంతులే

పాఠశాలలో మధ్యా హ్న భోజనం తినలేకపో తున్నాం. ఒకవేళ తింటే వాంతులు అవుతున్నా యి. ఇంటికి వెళ్లి భోజనం చేస్తున్నాం.

చాపల చైతన్య, విద్యార్థి, దేవరపల్లి


రోజూ ఇంతే..

మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నాం. కూరలు, పచ్చళ్లు నీళ్లలా ఉంటున్నాయి. అన్నం సరిగా ఉడకదు. పులిహోర, కిచిడి అధ్వానం.

ఝాన్సీరాణి, విద్యార్థిని 


ఏజెన్సీలతో వంటలు వద్దు..

సాంకేతికత, యంత్రాలపై వంటలు ఇలాగే ఉంటాయి. శాస్ర్తీయంగా వండి పెడితే పిల్లలకు ఆరోగ్యం. పెద్దమొత్తంలో ఏజెన్సీలు కాకుండా అన్ని పాఠశాలల్లో గతంలో మాదిరి ఏర్పాటు చేస్తే మేలు

వై.పైడియ్య, హెచ్‌ఎం, దుద్దుకూరు


భోజనం బాగాలేదని చెప్పినా..

పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగుండడం లేదని చెప్పినా ఏజెన్సీ పట్టించుకోవడం లేదు, ఏజెన్సీని రద్దు చేసి స్థానికుల ద్వారా ఏర్పాటు చేయాలని అధి కారుల దృష్టికి తీసుకెళ్లాం. ఫిర్యాదు చేశాం.

బీ.శ్రీలక్ష్మి, హెచ్‌ఎం, దేవరపల్లి

Updated Date - 2021-04-11T05:19:49+05:30 IST