పూనమ్ యాదవ్ విజృంభణ.. పేకమేడలా కూలుతున్న ఆసీస్ వికెట్లు

ABN , First Publish Date - 2020-02-21T21:47:30+05:30 IST

మహిళల టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భారత్ పట్టుబిగుస్తోంది. టీమిండియా బౌలర్ పూనమ్ యాదవ్

పూనమ్ యాదవ్ విజృంభణ.. పేకమేడలా కూలుతున్న ఆసీస్ వికెట్లు

సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భారత్ పట్టుబిగుస్తోంది. టీమిండియా బౌలర్ పూనమ్ యాదవ్ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలింది. 133 పరుగులు స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలుత విజయం దిశగా పయనిస్తున్నట్టు కనిపించింది. అయితే, పూనమ్ యాదవ్ బౌలింగ్‌లోకి దిగాక ఆట స్వరూపం మారిపోయింది. ఆస్ట్రేలియా వరుసపెట్టి వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో పడింది.  అర్ధ సెంచరీ చేసి జోరుమీదున్న అలీసా హీలీ (51)ని తొలుత వెనక్కి పంపిన పూనమ్.. ఆ తర్వాత రేచల్ హేన్స్ (6), ఎలీస్ పెర్రీ (0), జెస్ జొనాసెన్ (2)లను పెవిలియన్ పంపింది.  ప్రస్తుతం 15 ఓవర్లు పూర్తయ్యాయి. ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి ఇంకా 30 బంతుల్లో 42 పరుగులు అవసరం కాగా, చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. భారత జట్టు విజయానికి కావాల్సింది నాలుగు వికెట్లే. 

Updated Date - 2020-02-21T21:47:30+05:30 IST