10 నుంచి అందుబాటులోకి కోవిడ్ కిడ్స్ : పూనం మాలకొండయ్య

ABN , First Publish Date - 2020-04-04T23:20:19+05:30 IST

మెడ్ టెక్ జోన్‌లో కోవిడ్ కిట్లు, వెంటిలేటర్లు ఉత్పత్తి చేస్తున్నారని..

10 నుంచి అందుబాటులోకి కోవిడ్ కిడ్స్ : పూనం మాలకొండయ్య

అమరావతి : మెడ్ టెక్ జోన్‌లో కోవిడ్ కిట్లు, వెంటిలేటర్లు ఉత్పత్తి చేస్తున్నారని.. ఈ నెల 10వ తేదీ నుంచి ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తాయని పరిశ్రమల శాఖ కార్యదర్శి పూనం మాల కొండయ్య తెలిపారు. శనివారం సాయంత్రం ఈ వివరాలను పంచుకున్నారు.


అత్యంత కీలకంగా మారబోతోంది!

10 కోవిడ్ కిట్లు.. 20వ తేదీ నుంచి వెంటిలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తాయి. మెడ్‌టెక్ జోన్‌లో వైద్య పరికరాల ఉత్పత్తి జరుగుతోంది. ఈ పరికరాలను కూడా పరీక్ష చేసే 13 లాబ్స్ కూడా ఉన్నాయి. దీనికి కేంద్ర నుంచి కూడా ధ్రువీకరణ చేసి సింగిల్ విండోగా అనుమతులు వస్తాయి. మెడ్ టెక్ జోన్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మరిన్ని ఉత్పతుల తయారీ కేంద్రం అవుతుంది. దేశంలోనే వైద్య పరికరాల ఉత్పత్తిలో అత్యంత కీలకంగా మారబోతోందిఅని ఆమె తెలిపారు.


చాలా కీలకం..

‘ మెడ్‌టెక్ జోన్ ఎండీ సీఈఓ జితేందర్ శర్మ ప్రభుత్వ సహకారంతో దీన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వల్ల వివిధ దేశాలు కరోనా కిట్లు, వెంటిలేటర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి. ఈ తరుణంలో మన రాష్ట్రంలో మెడ్ టెక్ జోన్‌లో ఇవి తయారవుతుండటం చాలా కీలకం. 3వేల వెంటిలేటర్లు ఏప్రిల్‌లో తయారు చేసే అవకాశం ఉంది. అలాగే నెలకు 6 వేల కిట్లు.. మే నుంచి ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. టెస్టింగ్ కిట్లు 10 వేల వరకు, మే నుంచి 25 వేల వరకు తయారు చేయొచ్చు. గతంలో ఈ మెడ్ టెక్ జోన్‌కు నిధులు రాలేదు. ఉత్పత్తులు మార్కెట్లోకి రాక ముందు వాటిని పరీక్ష చేసి విడుదల చేయాల్సి ఉంటుంది. వాటి కోసం లాబ్స్ అవసరం అవుతాయి. వాటిని ఏర్పాటు చేసే విషయంలో గతంలో కొందరు వ్యతిరేకంగా పనిచేశారు. జితేంద్ర శర్మ విషయంలో కొందరు లేనిపోని ఆరోపణలు చేశారు. వాటిపై విచారణ జరుగుతోంది. మెడ్ టెక్ జోన్‌లో సీటీ స్కానర్లు తయారు అవుతాయిఅని పూనం మాలకొండయ్య తెలిపారు.

Updated Date - 2020-04-04T23:20:19+05:30 IST