Abn logo
Jun 6 2020 @ 20:08PM

ఏ నటుడూ ఇలాంటి పనులు చేయించడు: పూనమ్ కౌర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అంటూ కొందరు హీరోయిన్ మీరా చోప్రా విషయంలో చేసిన కామెంట్స్‌తో ఇప్పుడు టాలీవుడ్ వేడెక్కింది. ఈ వ్యవహారం కేసుల వరకు వెళ్లింది. ఆల్రెడీ కేటీఆర్ దీనిపై స్పందించి మరింతగా ఈ విషయాన్ని ఆసక్తికరం చేశారు. ఏపీ ముఖ్యమంత్రిని కూడా ఎన్టీఆర్ అభిమానులపై చర్యలు తీసుకోవాలని మీరా చోప్రా కోరింది. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులమని చెప్పుకుంటూ మీరా చోప్రాపై అసభ్యకర కామెంట్స్ చేసిన వారిని కొందరిని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ వ్యవహారంలోకి నటి పూనమ్ కౌర్‌ని కూడా కొందరు లాగారు. ఆమె ఈ గొడవపై తాజాగా కొన్ని ట్వీట్స్ చేశారు.


‘‘ఏ హీరో కూడా తమ అభిమానులను ఇతరులపై కామెంట్స్ చేయాలని, వారిని ఇబ్బంది పెట్టాలని కోరుకోడు. ఇండస్ట్రీ, మీడియాలో ఉన్న జెలసీ కారణంగానే ఇటువంటివి జరుగుతుంటాయి. నటీనటులెవ్వరికీ ఇలాంటి పనులు చేసేంత, చేయించేంత సమయం కూడా ఉండదు. ట్రోలింగ్ అనేది నటీనటుల జీవితాల్లో భాగమైపోయింది. ఇటువంటి వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ట్రోలింగ్ అనేది ఆటలా అనిపిస్తుంది. ఇబ్బంది పడకండి.  


అభిమానుల పేరుతో కొందరు రాజకీయ కారణాల కోసం ఇటువంటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఉంటారేమో అని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. ఏది ఏమైనా చివరికి బ్లేమ్ అయ్యేది మాత్రం నటీనటులే. సినిమా రంగం ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో కలిపిపోయి ఉంటుంది. ఇక్కడ అభిమానులు అనేవారు అమాయకులు. కొందరు రాజకీయ నాయకులే దుర్మార్గులు. వాళ్లే ఇటువంటివి చేసేది. 


నా పేరును కూడా అస్తమానం అనవసరంగా ఇటువంటి వివాదాలలోనికి లాగుతూ ఉన్నారు. కానీ నేను ఓ ఒక్క అభిమాని మీద కూడా కంప్లయింట్ చేయలేదు. ఎందుకంటే వారు అమాయకులని నా నమ్మకం మరియు మధ్యలో ఉండే మీడియాకి చెందిన కొందరు వారి ప్రయోజనాల కోసం ఇలా చేయిస్తున్నారని నమ్ముతాను. అందుకే నన్ను ఇబ్బంది పెట్టినవారిపై మాత్రమే కంప్లయింట్ ఇచ్చాను. దయచేసి గొడవల కోసం అభిమానులను బ్లేమ్ చేయవద్దు..’’ అని పూనమ్ తన వరుస ట్వీట్స్‌లో పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement