Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమాజహితం కోసం పూలే కృషి అనిర్వచనీయం

రాష్ట్ర సామాజిక తెలంగాణ ధూంధాం కన్వీనర్‌ మారంపల్లి రవీంధర్‌

కథలాపూర్‌, డిసెంబరు 2 : సావిత్రిభా, మహాత్మా జ్యోతిబా పూలేలు సమాజహితం కోసం చేసిన కృషి ఎంతో ఆదర్శనీయమని రాష్ట్ర సామాజిక తెలంగాణ ధూంఽధాం కన్వీనర్‌ మారంపల్లి రవీంధర్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని భూషణరావుపేటలో సబ్‌ స్టేషన్‌ సమీపంలో ఫూలేల విగ్రహాల ఏర్పాటు చేయ నుండగా స్థల పరీశీలన జరిపిన అనం తరం ప్రెస్‌క్ల బ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ వర్ధంతి రోజైన డిసెంబరు 6న విగ్రహాలకు శంఖుస్థాపన చేసి సావి త్రిభాయి పూలే 190వ జయంతి రోజైన జనవరి 3న విగ్రహాలు ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. బడుగు, బ లహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం తపించిన మహా నీయులను స్మరించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చదువుతోనే మనిషి విజ్ఞానవంతుడు కా వడానికి ఆస్కారం ఉందని చాటిచెప్పి ఎందరికో వి ద్యాకాంతులను వెదజల్లారని అన్నారు. దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో నిరుపేదలు కార్యక్ర మానికి తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ యువజన సంఘ జిల్లా సాం స్కృతిక శాఖ అధ్యక్షుడు బత్తుల నరేశ్‌, కాశవత్తుల లక్ష్మీరాజం, బెజగం గంగాధర్‌, తెడ్డు శేఖర్‌, లింగంపల్లి మధు, అజీం, శ్రీధర్‌, బాలె నీలకంఠం, పానుగంటి భా స్కర్‌, రమేశ్‌, చిట్యాల రాజేశ్‌, సంజీవ్‌, మణి, రవి చంద్‌ ఉన్నారు.

Advertisement
Advertisement