Abn logo
Mar 28 2021 @ 00:21AM

పూజా వయా చెన్నై!

తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో ఫుల్‌  బిజీగా ఉన్నారు కథానాయిక పూజాహెగ్డే. ఇక నుంచి ఆమె సినిమా షూటింగ్‌ కోసం చెన్నై, ముంబై, హైదరాబాద్‌ చుట్టేయనున్నారు. సినిమా షూటింగ్‌ కోసం తరచూ హైదరాబాద్‌ నుంచి ముంబైకి వెళ్లి వస్తుండేవారు పూజా. ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్‌’ రామ్‌చరణ్‌తో ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన పూజా ఇటీవల తమిళంలో విజయ్‌ సరసన కథానాయికగా ఓ చిత్రం అంగీకరించారు. ఆ సినిమా పని మీద ఇప్పుడామె చెన్నైలో ఉన్నారు. అక్కడ నుంచి విమానంలో ముంబైకి బయల్దేరుతున్నారు. త్వరలో సల్మాన్‌ఖాన్‌ ‘కబీ ఈద్‌ కబీ దివాళి’ సినిమా షూటింగ్‌లో పూజా పాల్గొంటారు.