Abn logo
Apr 7 2020 @ 16:47PM

అతను నా స్నేహితుడు మాత్రమే: పూజా హెగ్డే

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పూజా హెగ్డే బాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. గతేడాది `హౌస్‌ఫుల్-4`తో ఘనవిజయం అందుకున్న పూజ మరోసారి అక్షయ్ కుమార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా పూజ వ్యక్తిగత జీవితం గురించి బాలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 


బాలీవుడ్ ప్రముఖ హీరో వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రాతో పూజ ప్రేమలో పడిందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రేమ వార్తల గురించి పూజ స్పందించింది. ఆ వార్తలు అవాస్తవాలని స్పష్టం చేసింది. `ప్రస్తుతం నేను ఎవరితోనూ ప్రేమలో లేను. రోహన్ నాకు మంచి మిత్రుడు. అంతే.. అంతకు మించి మా మధ్యం ఇంకేం లేద`ని పూజ క్లారిటీ ఇచ్చింది. 

Advertisement
Advertisement
Advertisement