పూజా హెగ్డే ‘స్కూబా డైవింగ్‌’ ఫొటోలు వైరల్

హీరోయిన్‌ పూజా హెగ్డే మాల్దీవుల్లో విశ్రాంతి తీసుకుంటోంది. అక్కడ పర్యాటక ప్రాంతాల్లో విహరిస్తూ సముద్రగర్భంలో వివిధ రకాల సాహసాలు చేస్తోంది. తాజాగా ‘స్కూబా డైవింగ్‌’ పేరుతో సముద్ర గర్భంలో స్విమ్మింగ్‌ చేస్తూ తీసిన ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి వైరల్‌ అయ్యాయి. ఈ ఫోటోల కింద ‘సముద్ర జలాల్లో నీమోను, నీమో స్నేహితులను గుర్తించాను. వారంతా బాగున్నారు’ అంటూ పోస్ట్ చేసింది.. ఇక్కడ నీమో అంటే, ప్రముఖ యానిమేషన్‌ చిత్రమైన ‘బైండింగ్‌ నీమో’ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించే చేప. ఇదిలావుంటే, పూజా హెగ్డే ప్రస్తుతం కోలీవుడ్‌లో ‘బీస్ట్‌’ చిత్రంలో హీరో విజయ్‌ సరసన నటిస్తుండగా.. టాలీవుడ్‌లో ఆమె నటించిన ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.


Advertisement