మొక్క నాటిన పూజా హెగ్డే

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా టాలీవుడ్‌ హీ రో సుషాంత్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరోయిన్‌ పూజాహెగ్డే శుక్రవారం రామోజీఫిల్మ్‌ సిటీలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని సంరక్షించాలనే లక్ష్యంతో చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం గ్లోబల్‌ వార్మింగ్‌ను అరికట్టడానికి దోహదపడుతుందన్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రితేష్‌దేశ్‌ముఖ్‌ , అక్షయ్‌ కుమార్‌లకు ఆమె గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను విసిరారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి సంరక్షించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ పాల్గొన్నారు. 


Advertisement