Sep 17 2021 @ 23:28PM

డబ్బింగ్‌ చెబుతున్న బుట్టబొమ్మ

తెలుగు చిత్రాల్లో కనిపించడంతో పాటు తన గొంతే వినిపించాలని తపించే బాలీవుడ్‌ హీరోయిన్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. అఖిల్‌ అక్కినేని సరసన నటించిన రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ చిత్రంతో తన సొంత గొంతుతో ప్రేక్షకులను అలరించడానికి పూజ సిద్ధమవుతున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. బన్నీ వాసు, వాసు వర్మ ఈ చిత్రానికి నిర్మాతలు. ‘మేం విడుదల చేసిన ప్రతి అప్డేట్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇటీవల విడుదలైన ‘లెహరాయి’ పాటకు కూడా యూ ట్యూబ్‌లో అనూహ్య స్పందన వస్తోంది. అక్టోబర్‌ 8న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని నిర్మాతలు చెప్పారు.