Oct 28 2021 @ 10:54AM

Pooja hegde: ముంబైలో సొంతింటిపనుల్లో బిజీ బిజీ

స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ముంబయిలో సెటిలవడానికి ట్రై చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె అక్కడ సొంత ఇల్లు నిర్మించుకుంటోంది. ఈ విషయాన్ని పూజా హెగ్డే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది. ఈ మేరకు.. "సొంత ఇల్లు కలిగివుండడం అనేది తన కల అని, ఇప్పుడది నెరవేరుతోంది"..అని పూజ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. అంతేకాదు తన ఇంటి పనులకు సంబంధించిన ఓ పిక్‌ను కూడా షేర్ చేసింది. ఈ పిక్‌లో పూజ తల్లి కూడా ఉన్నారు. "నా కలలను నిర్మించుకుంటున్నాను" అంటూ బుట్టబొమ్మ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక పూజ హెగ్డే సొంతింటి నిర్మాణ పనులను ఆమె తల్లి దగ్గరుండి చూసుకుంటున్నారు. దాంతో పూజ తన తల్లిని 'సూపర్ మామ్' అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఆమె నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఇటీవలే రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. 2022, ప్రభాస్‌తో నటించిన 'రాధే శ్యామ్', మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమాలతో రాబోతోంది. అంతేకాదు పూజా తమిళంలో విజయ్ సరసన ఓ సినిమా, హిందీలో రెండు సినిమాలు చేస్తోంది.