Apr 19 2021 @ 08:38AM

ఒకే రూట్‌లో వెళుతున్న పూజా హెగ్డే, రష్మిక..!

ఇద్దరూ హీరోయిన్స్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర కథానాయికలుగా రాణిస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ను కవర్‌ చేసుకుంటూనే బాలీవుడ్‌లో అడపా దడపా ఆడిపాడేస్తున్నారు. ఇంతకీ ఆ ఇద్దరెవరో కారు.. పూజా హెగ్డే, రష్మిక మందన్న. వరుస అవకాశాలతో బిజి బిజీగా ఉన్నఈ బ్యూటీస్‌ ఇప్పుడు ఓ రూట్‌లో ట్రావెల్‌ చేస్తున్నారు. అది కూడా సినిమాల్లో వారు చేస్తున్న పాత్రల పరంగా. ఇది యాదృచ్చికంగానే జరిగినప్పటికీ, సినీ అభిమానుల్లో ఆసక్తిని కలుగజేస్తోంది.  వివరాల్లోకి వెళితే.. పూజా హెగ్డే ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఆచార్య' సినిమాలో నటించింది. ఈ చిత్రంలో సిద్ధ అనే కీలక పాత్రలో రామ్‌చరణ్‌ నటించాడు. అతనితో జోడీ కట్టింది పూజా హెగ్డే. ఇందులో పూజా హెగ్డే గిరిజన ప్రాంతానికి చెందిన యువతిగా కనిపిస్తుందని సమాచారం. కాగా.. రష్మిక ప్రస్తుతం చేస్తున్న పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప'లో గిరిజన ప్రాంతానికి చెందిన అమ్మాయిగా కనిపిస్తుందని అంటున్నారు. మరి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై ఇద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.