గ్లామర్‌ తారలంతా అక్కడివారే: పూజాహెగ్డే

తమిళంలో ‘మూగముడి’, తెలుగులో ‘ఒక లైలా కోసం’, హిందీలో ‘మొహంజోదారో’ చిత్రాలతో కథానాయికగా  పరిచయమయ్యారు పూజాహెగ్డే. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుని మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. తమిళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎక్కువ నటించింది తెలుగు సినిమాల్లోనే. అయితే పూజా ఈ మూడు భాషలకు చెందిన అమ్మాయి కాదు. కన్నడ అమ్మాయి. ఇదే మాట ఆమెను అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చింది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లో పాపులర్‌ అయినా కర్ణాటక అమ్మాయిగా గుర్తింపు పొందడమే ఆమెకు ఇష్టమని చెప్పుకొచ్చింది. ‘‘నా మూలాల్ని నేను ఎప్పుడూ ప్రేమిస్తాను. మంగుళూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గర్విస్తాను. నేను ముంబైలో పుట్టిపెరిగినప్పటికీ, కన్నడ అమ్మాయి అనిపించుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను. కన్నడ నీళ్లలో ఏదో ఉంది, గ్లామర్‌ తారలంతా అక్కడ్నుంచే వస్తున్నారని చాలామంది నాతో అంటుంటారు. ఆ మాట విన్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది. నా మాతృభాష నుంచి అవకాశం వస్తే నటించడానికి సిద్థంగా ఉన్నట్టు తెలిపింది పూజా. Advertisement