Abn logo
Sep 28 2020 @ 14:13PM

'రాధేశ్యామ్'‌.. పూజా హెగ్డే పాత్రలో ట్విస్ట్‌ అదేనా..!

Kaakateeya

స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ప్రభాస్‌ 20వ చిత్రం రాధేశ్యామ్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. పీరియాడికల్‌ లవ్‌స్టోరిగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజా మ్యూజిక్‌ టీచర్‌గా కనిపిస్తుందని వార్తలు వినిపించాయి. కాగా.. తాజా సమాచారం మేరకు పూజ పాత్రకు సంబంధించి మరో న్యూస్‌ హల్‌చల్‌ చేస్తోంది. అదేంటంటే, రాధేశ్యామ్‌లో పూజా హెగ్డే డ్యూయెల్‌రోల్‌లో కనిపించనుందని. అందులో ఓ లుక్‌ ట్రెడిషనల్‌ క్లాసిక్‌గా ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే చిత్ర యూనిట్‌ స్పందించాల్సిందే. 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది.


Advertisement
Advertisement
Advertisement