నారాయణస్వామి ఆలయంలో పూజలు

ABN , First Publish Date - 2021-03-01T06:43:26+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నారాయణస్వామి ఆలయంలో పూజలు
స్వామివారికి సమర్పించిన వెండి తొడుగులు

సీఎ్‌సపురం, ఫిబ్రవరి 28 : ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఎం.సత్యనారాయణశర్మ ఆధ్వర్యంలో స్వామివారిని అలంకరించి స్వామివారికి పంచామృతాభిషేకం, హారతులు, గోపూజ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు మహానైవేథ్యంతో గుడి చుట్టూ ప్రదక్షణలు చేసి స్వామివారికి సమర్పించారు. ఆలయ కారనిర్వాహణాధికారి కె.నవీన్‌కుమార్‌, దేవస్థాన ఛైర్మన్‌ దుగ్గిరెడ్డి జయరెడ్డి భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా పర్యవేక్షించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు.

వెండి తొడుగు బహూకరణ

కడప జిల్లా పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి కన్ట్రక్షన్‌ ప్రవేటు లిమిటెడ్‌ కలవకూరి దస్తగిరి, కుటుబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి వెండి తొడుగులు బహూకరించారు.  ఆయన చెల్లెలు కాశమ్మ, కుమారులు ఉదయ నారాయణ లక్ష్మీప్రసన్న దంపతులు, వెంకటనారాయణ సుస్మిత చౌదరి దంపతులు,  గుర్రం మాల్యాద్రినాయుడు రాజేశ్వరి దంపతులు అభరణాల తయారీకి తోడ్పాటు అందించారు. నారాయణస్వామివారి గర్భగుడి గుమ్మటానికి రూ.11.60 లక్షల విలువైన 14.754 కిలోల వెండి తొడుగును ఆదివారం బహూకరించారు.

Updated Date - 2021-03-01T06:43:26+05:30 IST