Apr 9 2021 @ 00:42AM

సంక్రాంతికి పొన్నియిన్‌ సెల్వన్‌!

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చారిత్రక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు హీరో కార్తి. భారీ హంగులతో ప్రతిష్టాత్మకంగా మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత పునః ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌ విశేషాలను గురించి హీరో కార్తీ తన ‘సుల్తాన్‌’ సక్సెస్‌ మీట్‌లో మాట్లాడుతూ ‘‘పొన్నియిన్‌ సెల్వన్‌’ 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. అయితే కరోనా నేపథ్యంలో అప్పటి పరిస్థితుల మీద అది ఆధారపడి ఉంటుంది. కరోనా వల్ల మిగిలిన షూటింగ్‌ పార్ట్‌ను మధ్యప్రదేశ్‌లో జరపడానికి అనుమతులు రాలేదు. త్వరలోనే చెన్నై, హైదరాబాద్‌లో మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేస్తాం’’ అని చెప్పారు.