జానాతో పొన్నాల భేటీ

ABN , First Publish Date - 2021-11-25T22:14:31+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డితో టీపీసీసీ

జానాతో పొన్నాల భేటీ

హైదరాబాద్‌: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డితో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. జనగామ కాంగ్రెస్ ఇష్యూలో జంగా రాఘవరెడ్డికి ఉత్తమ్‌ సపోర్ట్ చేయడంపై పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి నియోజకవర్గంలో మరొకరు కలుగజేసుకుంటే పార్టీకి నష్టమని పొన్నాల అభిప్రాయపడ్డారు. ఇప్పటికే జంగా రాఘవరెడ్డికి  పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. పొన్నాల, జంగా రాఘవరెడ్డి వర్గాలను కాంప్రమైజ్ చేసే పనిలో జానారెడ్డి పడ్డారు. 




ఇటీవల నగరంలోని కొంపల్లిలో కాంగ్రెస్ శిక్షణా తరగతులు జరిగిన సంగతి తెలిసిందే. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా జనగామ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేసి గొడవ చేశారు. దీంతో ఈ సంఘటనను పార్టీ సీరియస్‌గా తీసుకుంది. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్‌లకు పార్టీ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. జనగామ సీటు విషయంలో పొన్నాల, జంగా మధ్య అంతర్గతంగా రాజకీయ యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు కీలక నేతలకు షోకాజ్ నోటీసులు జారీ కావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. 



Updated Date - 2021-11-25T22:14:31+05:30 IST