కాంగ్రె్‌సతోనే అన్నదాతకు న్యాయం

ABN , First Publish Date - 2022-05-24T05:19:56+05:30 IST

కాంగ్రె్‌సతోనే రైతుకు న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. చేర్యాల పట్టణంతోపాటు మండలంలోని నాగపురి, షబాశిగూడెం, పెద్దరాజుపేట, పోతిరెడ్డిపల్లి, కడవేరుగు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రైతురచ్చబండ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయానికి, రైతాంగానికి వన్నె తీసుకువచ్చిన ఘనత కాంగ్రె్‌సదేనని పేర్కొన్నారు. తమ హయాంలో పంట రుణాలను ఏకకాలంలో మాఫీచేశామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ప్రవేశపెట్టామని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు.

కాంగ్రె్‌సతోనే అన్నదాతకు న్యాయం
ధాన్యం తూర్పారపడుతున్న పొన్నాల లక్ష్మయ్య

ఉచిత కరెంటు, ఏకకాలంలో రుణమాఫీ చేసి చూపించాం : పొన్నాల లక్ష్మయ్య


చేర్యాల, మే 23 : కాంగ్రె్‌సతోనే రైతుకు న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. చేర్యాల పట్టణంతోపాటు మండలంలోని నాగపురి, షబాశిగూడెం, పెద్దరాజుపేట, పోతిరెడ్డిపల్లి, కడవేరుగు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రైతురచ్చబండ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయానికి, రైతాంగానికి వన్నె తీసుకువచ్చిన ఘనత కాంగ్రె్‌సదేనని పేర్కొన్నారు. తమ హయాంలో పంట రుణాలను ఏకకాలంలో మాఫీచేశామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ప్రవేశపెట్టామని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 17 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి సహాయం,  రైతుబీమా అందజేస్తామని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంటల సాగు, కొనుగోలు విషయంలో రైతాంగాన్ని అయోమయానికి గురిచేస్తున్నదని విమర్శించారు. వరంగల్‌ డిక్లరేషన్‌లోని అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి వకుళాభరణం నర్సయ్య, నాయకులు నాగమల్ల శ్రీనివాస్‌, ఇక్బాల్‌, ఆది శ్రీనివాస్‌, చిరంజీవులు, కొమ్మురవి,  జానకిస్వామి, తార, లింగం, బూర శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:19:56+05:30 IST