బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం: పొంగులేటి

ABN , First Publish Date - 2022-04-19T19:27:24+05:30 IST

పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని పొంగులేటి పరామర్శించారు.

బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం: పొంగులేటి

ఖమ్మం: పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మాజ్దూర్ యూనియన్ జిల్లా కన్వీనర్ సాయి గణేష్ కుటుంబాన్ని తమిళనాడు బీజేపీ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పరామర్శించి.. లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. పోలీస్ కేసులు, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడాన్ని అందరూ ఖండిస్తున్నారన్నారు. 


ఖమ్మంలో ధర్మం, న్యాయం మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని, సాయి గణేష్ చనిపోయే ముందు వీడియోలో జిల్లా మంత్రి, కార్పొరేటర్ వేధింపులతో చనిపోతున్నానని చెప్పినా.. వారిపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేయలేదని పొంగులేటి మండిపడ్డారు. సాయి గణేష్  ఘటనపై సిట్టింగ్ జడ్జీతో కానీ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పువ్వాడ అజయ్‌ను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలన్నారు. పోలీసులు ప్రజల పక్షాన పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రికి చట్టంపై నమ్మకం ఉంటే మంత్రి పువ్వాడను బర్తరఫ్ చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-19T19:27:24+05:30 IST