పొంగిన గార్గేయనది

ABN , First Publish Date - 2022-08-18T06:31:36+05:30 IST

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గార్గేయనది బుధవారం పొంగింది. ఐరాల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నీరు నేల వంతెనపై ఉధృతంగా ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగించింది.

పొంగిన గార్గేయనది
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గార్గేయ నదిలో పడిన యువతిని కాపాడుతున్న యువకులు

యువతికి తప్పిన ప్రమాదం


ఐరాల, ఆగస్టు 17: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గార్గేయనది బుధవారం పొంగింది. ఐరాల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నీరు నేల వంతెనపై ఉధృతంగా ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగించింది. దీంతో ఉదయం చాలాసేపటి వరకు రాకపోకలు స్తంభించాయి. ఓ యువతి నదిని దాటడానికి ప్రయత్నించగా ద్విచక్రవాహనం అదుపు తప్పి వంతెనపై పడిపోయింది. అక్కడే ఉన్న కొందరు యువకులు అతికష్టంపై ఆమెను రక్షించి.. ఒడ్డుకు చేర్చారు. గతేడాది గార్గేయ నదిలో కారుతో సహా కొట్టుకు పోయి వినయ్‌కుమార్‌రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇక్కడ పెద్ద బ్రిడ్జిని నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు. 

Updated Date - 2022-08-18T06:31:36+05:30 IST