భద్రాద్రి కొత్తగూడెం : దమ్ము ధైర్యం ఉంటే భద్రాద్రి రామయ్య కల్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీసుకురావాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య సవాల్ విసిరారు. తూతూ మంత్రంగా నవమి సమీక్షలు చేయవద్దని సూచించారు. ఏప్రిల్ 10న జరగనున్న నవమి ఏర్పాట్లపై ఈ రోజు జిల్లా మంత్రి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అధ్యక్షతన భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష జరగనుంది.