చెరువా.. డంపింగ్‌ యార్డా?

ABN , First Publish Date - 2022-05-10T04:34:17+05:30 IST

నగరానికి దాహార్తిని తీర్చే గండిపేట చెరువు

చెరువా.. డంపింగ్‌ యార్డా?
గండిపేట చెరువులో నిండిపోయిన చెత్త

మొయినాబాద్‌ రూరల్‌, మే 9 : నగరానికి దాహార్తిని తీర్చే గండిపేట చెరువు కలుషితమవుతోంది. మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌ సమీపంలోని గండిపేట చెరువు చెత్తచెదారంతో నిండి డంపింగ్‌ యార్డును తలపిస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రజల్లో చైతన్యం రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే హిమాయత్‌నగర్‌ గ్రామపంచాయతీ పరిధికి వచ్చే చెరువులో గ్రామస్తులే చెత్త వేస్తున్నట్లు తెలుస్తోంది. చెత్త వేయకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చెరువు పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. నిత్యం గస్తీ నిర్వహించే జలమండలి అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది స్పందించి చెరువులో చెత్తచెదారం వేయకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. 



Read more