భారీ వర్షాలు.. ఆరు చెరువులు ఆగమాగం..!

ABN , First Publish Date - 2020-11-01T11:52:00+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలో ఉన్న ఆరు చెరువులు బాగా దెబ్బతిన్నాయని, మరో 14 చెరువుల కట్టలపై నుంచి నీరు ప్రవహించిందని నీటిపారుదల శాఖ నిపుణుల బృందం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా చెరువుల పటిష్టతను పరిశీలించి, సంరక్షణ చర్యలు

భారీ వర్షాలు.. ఆరు చెరువులు ఆగమాగం..!

హైదరాబాద్‌ : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలో ఉన్న ఆరు చెరువులు బాగా దెబ్బతిన్నాయని, మరో 14 చెరువుల కట్టలపై నుంచి నీరు ప్రవహించిందని నీటిపారుదల శాఖ నిపుణుల బృందం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా చెరువుల పటిష్టతను పరిశీలించి, సంరక్షణ చర్యలు చేపట్టాలన్న మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు నీటి పారుదలశాఖ 15 మంది ఇంజనీర్లు, అధికారులతో నిపుణుల బృందాన్ని నియమించింది. ఈ బృందం నగర పరిధిలోని 185 చెరువులు, కుంటలతోపాటు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు చెరువులను పరిశీలించి, నివేదిక తయారు చేసింది. ఈ నివేదికలో భారీ వర్షాల కారణంగా 14 చెరువులకు గండ్లు పడ్డాయని, ఆరు చెరువులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని తెలిపింది. 27 తూములు, 32 చెరువుల కట్టలు, 31 చెరువుల అలుగులు దెబ్బతిన్నాయని నివేదికలో వెల్లడించింది. దెబ్బతిన్న చెరువుల రక్షణకు, అత్యవసర మరమ్మతులకు రూ. 9,84 కోట్ల పైచిలుకు, శాశ్వత మరమ్మతులకు రూ. 31.34 కోట్ల నిధులు అవసరమవుతాయని నిపుణుల కమిటీ తేల్చింది. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న మైలార్‌దేవ్‌పల్లిలోని పల్లెచెరువు, గుర్రం చెరువు, అప్పాచెరువు, సూరారం చెరువు, ఎర్రకుంట చెరువు, కుమ్మరికుంట చెరువు, చిన్నపెద్ద చెరువు, కొత్తకుంట, తిమ్మక్క చెరువులను సంరక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశారు.

Updated Date - 2020-11-01T11:52:00+05:30 IST